Sharwanand : శర్వానంద్ శ్రీకారం అన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కి ముందే ఈ సినిమా టైటిల్ పోస్టర్ తో పాటు శర్వానంద్ లుక్ ని రిలీజ్ చేశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుందని ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఇక శర్వానంద్ శతమానం భవతి సినిమా తర్వాత సరైన హిట్ అందుకోలేకపోయాడు. శర్వానంద్ నుంచి పడి పడి లేచె మనసు, రణరంగం, జాను లాంటి సినిమాలు వచ్చాయి. కానీ ఈ సినిమాలలో ఏ ఒక్కటి కూడా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటలేకపోయారు. జాను సినిమా మీద చాలా నమ్మకాలు పెట్టుకున్న శర్వానంద్ కి గట్టి షాకే తగిలింది.
అయితే జాను తర్వాత మళ్ళీ తనకి బాగా కలిసొచ్చిన ఫ్యామిలీ కథనే ఎంచుకున్నాడు. అద్భుతమైన కథ అన్న టాక్ కూడా ఉంది. కాగా ఈ సినిమాలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు మేకర్స్. శ్రీకారం సినిమాని మార్చి 11న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచారు. ఈ క్రమంలో వరసగా ఈ సినిమా నుంచి లిరికల్ వీడియో సాంగ్స్ ని రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ అయిన ప్రతీ సాంగ్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Sharwanand : శ్రీకారం సినిమా విషయంలో కూడా అదే భావిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుంచి భలేగుంది బాలా అన్న సాంగ్ రిలీజై ట్రెండింగ్ లో నిలిచింది. ఈ సాంగ్ మాస్ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంది. ఆ తర్వాత రిలీజైన సందళ్ళే సందెళ్ళే అన్న సాంగ్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కాగా తాజాగా శ్రీకారం సినిమా నుంచి యూత్ ని ఆకట్టుకునే సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ‘హే అబ్బాయి’ అంటూ హీరోయిన్.. హీరోని టీజ్ చేసే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ కాగా అందరినీ ఆకట్టుకోవడమే కాదు సినిమా మీద భారీగా అంచనాలను పెంచుతోంది. అంతేకాదు ఏ సినిమా అయినా మ్యూజికల్ గా హిట్ అయితే దాదాపు సినిమా సూపర్ హిట్ అని ఫిక్స్ అవుతారు. ఇప్పుడు అందరూ శ్రీకారం సినిమా విషయంలో కూడా అదే భావిస్తున్నారు.