Subscribe for notification

వెంకీ సినిమాను శర్వానంద్ లాగేసుకున్నాడా? ఇదెక్కడి దారుణం??

Share

శర్వానంద్ హీరోగా తన ఫామ్ ను కోల్పోయాడు. రీసెంట్ గా శర్వానంద్ నటించిన మూడు సినిమాలు వరసగా ప్లాపయ్యాయి. ఇలాంటి బ్యాడ్ ఫామ్ లో ఉన్నప్పుడు శర్వానంద్ చేసిన పని ఇప్పుడు వార్తల్లో నిలుస్తోంది. శర్వానంద్ హీరోగా శ్రీకారం చేస్తోన్న విషయం తెల్సిందే. రైతుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది.

 

sharwanand to do venkateshs movie

 

లాక్ డౌన్ కు ముందు విడుదల చేసిన ప్రీ టీజర్ ఆసక్తికరంగానే ఉంది. మరి కొద్ది రోజుల షూటింగ్ మాత్రం మిగిలుంది. వచ్చే నెల నుండి ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమవుతుంది. అక్టోబర్ నెలాఖరుకు షూటింగ్ పూర్తవ్వవచ్చు. ప్లాపుల్లో ఉన్నా కానీ శర్వానంద్ సినిమాలకు ఢోకా అయితే లేదు. ఎందుకంటే వరస సినిమాలకు కమిటై ఉన్నాడు.

శర్వానంద్ హీరోగా ఆరెక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి మహా సముద్రం అనే చిత్రాన్ని తెరకెక్కించనున్న సంగతి తెల్సిందే. సిద్ధార్థ్ మరో కీలక పాత్రలో నటిస్తాడు. వచ్చే ఏడాది మొదట్లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశముంది. ఇక అసలు విషయానికొస్తే వెంకటేష్ చేయాల్సిన సినిమా ఒకటి ఇప్పుడు శర్వానంద్ చేయబోతున్నాడట. నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ చిత్ర దర్శకుడు కిషోర్ తిరుమల వెంకటేష్ హీరోగా ఆడవాళ్ళూ మీకు జోహార్లు అనే స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నాడు.

ఈ సినిమా కొన్ని కారణాల వల్ల నిలిచిపోయింది. ఈలోగా కిషోర్ తిరుమల రామ్ హీరోగా రెడ్ చిత్రాన్ని తెరకెక్కించాడు. అది ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. తాజా సమాచారం ప్రకారం ఆడవాళ్ళూ మీకు జోహార్లు చిత్రం కొన్ని మార్పులు చేర్పులు తర్వాత శర్వానంద్ వద్దకు వెళ్లిందట. విన్న వెంటనే స్క్రిప్ట్ నచ్చేయడంతో శర్వా మరో ఆలోచన లేకుండా ఎస్ చెప్పాడని తెలుస్తోంది. మహా సముద్రం పూర్తైన వెంటనే ఈ సినిమా పట్టాలెక్కుతుంది.

 


Share
sowmya

Recent Posts

Shriya Saran: ఎంత భ‌ర్తైతే మాత్రం రోడ్డుపై అత‌డితో అంత రెచ్చిపోవాలా శ్రియా..?

  Shriya Saran: అందాల భామ శ్రియ‌ సరన్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…

14 mins ago

CM YS Jagan: కుమార్తె హర్ష ప్రతిభకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్

CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…

47 mins ago

Vijay Deverakonda: విజ‌య్ న‌గ్న ఫొటోను వ‌ద‌ల‌డం వెన‌క అస‌లు కార‌ణం ఏంటో తెలుసా?

Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగ‌ర్‌`. డాషింగ్ అండ్ డైన‌మిక్…

1 hour ago

Udaipur Murder: ఉదయ పూర్ టైలర్ హత్య కేసు నిందితులపై కోర్టు ప్రాంగణంలో దాడి

Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…

2 hours ago

Mahesh Babu: ఆ మూవీకి ఫిదా అయిపోయిన మ‌హేశ్.. వ‌రుస ట్వీట్స్‌తో పొగ‌డ్త‌ల వ‌ర్షం!

Mahesh Babu: టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు ఇటీవ‌ల‌ `స‌ర్కారు వారి పాట‌`తో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న…

2 hours ago

Pakka Commercial: `పక్కా కమర్షియల్` క‌లెక్ష‌న్స్‌.. తొలి రోజే గోపీచంద్ న‌యా రికార్డ్‌!

Pakka Commercial: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్‌, అందాల భామ రాశి ఖ‌న్నా జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ప‌క్కా…

3 hours ago