Vijay devarakonda : విజయ్ దేవరకొండ ఎవడే సుబ్రమణ్యం సినిమాతో నటుడిగా టాలీవుడ్ కి పరిచయం అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత పెళ్ళి చూపులు సినిమాతో పూర్తి స్థాయి హీరోగా మారాడు. మొదటి సినిమా తో డీసెంట్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో రౌడీ స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాతో ప్రేక్షకుల్లో .. ఇండస్ట్రీ వర్గాలలో బాలీవుడ్ హీరోయిన్స్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు.
ముఖ్యంగా బాలీవుడ్ యంగ్ బ్యూటీస్ విజయ్ సరసన నటించేందుకు రెడీగా ఉన్నారు. ఇప్పటికే లైగర్ సినిమాతో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే విజయ్ సరసన నటిస్తోంది. కాగా విజయ్ దేవరకొండతో మరోసారి రష్మిక మందన్న నటిస్తే చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. రష్మిక ప్రస్తుతం టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లో క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ క్రేజీ హీరోయిన్ గా మారింది. టాలీవుడ్ లో పుష్ప సినిమా చేస్తోంది. పాన్ ఇండియన్ సినిమాగా 5 భాషల్లో తెరకెక్కుతోంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోంది.
Vijay devarakonda : విజయ్ దేవరకొండతో కథ సెట్ అయితే సినిమా చేసేందుకు రెడీ … రష్మిక
ఇక బాలీవుడ్ లో రష్మిక నటిస్తున్న రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగా తాజాగా మరో సినిమాకి సైన్ చేయబోతున్నట్టు స్వయంగా వెల్లడించింది. ఈ మూడు సినిమాలతో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారడం ఖాయమంటున్నారు. అయితే అభిమానులు రష్మిక మందన్న – విజయ్ దేవరకొండను మళ్ళీ స్క్రీన్ మీద చూడాలనుకుంటున్నారు. వంద కోట్ల క్లబ్ లో చేరిన గీత గోవిందం తో పాటు డియర్ కామ్రేడ్ సినిమాలో కలిసి నటించారు. అందుకే తాజాగా ఒక అభిమాని మళ్ళీ మీ కాంబినేషన్ చూడాలనుకుంటున్నామంటూ అడుగగా.. కథ సెట్ అయితే మేము కలిసి సినిమా చేసేందుకు రెడీగా ఉన్నామంటూ క్లారిటీ ఇచ్చింది.
Bigg Boss Ashwini: రాత్రి 4 అయినా నిద్ర పట్టడం లేదు… బోల్డ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ అశ్విని..!