టాలీవుడ్ సూపర్ స్టార్ తనయుడు ప్రిన్స్ మహేష్ బాబు నటన గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఇప్పటికే ఎనో సందర్భాలలో మహేష్ బాబు ఒక మంచి నటుడు మాత్రమే కాదు గొప్ప వ్యక్తిత్వం గల మనిషినని నిరూపించుకున్నాడు. ఇప్పటికే మహేష్ సినీ ఇండస్ట్రీ లోకి వచ్చి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పుడున్న టాలీవుడ్ హీరోలకి ఈ మాత్రం తీసిపోకుండా ఉంటాడు.
అసలు మహేష్ బాబు అంత అందాన్ని ఎలా మెయింటైన్ చేస్తున్నాడు అని చాలా మందిలో ఒక సందేహం ఉంది. సూపర్‌స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు ఇంత అందంగా కనిపించడానికి గల సీక్రెట్ ను తాజాగా వెల్లడించాడు. తన అందం మైంటెనెన్సు వెనుక ఎవరు ఉన్నారో కూడా చెప్పేసాడు మహేష్. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన సోషల్ మీడియా వేదికగా బయట పెట్టారు.
తాజాగా మహేష్ బాబు తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో తన అందం వెనుక ఉన్న రహస్యాన్ని తెలిపారు. మహేష్ ఓ ఫొటోను సోషల్ మీడియా లో షేర్ చేస్తూ “మై స్కిన్ స్పెషలిస్ట్” అని కామెంట్ పెట్టి సీక్రెట్ ను బయట పెట్టాడు. మహేష్ అందాన్నీ సంరక్షిస్తున్న ఆ డెర్మాటోలాజిస్ట్ పేరు డాక్టర్ రష్మి శెట్టి.
రష్మీ శెట్టి ప్రస్తుతం ముంబై లో పలువురు సెలబ్రిటీలకు కూడా డెర్మటాలజిస్ట్ గా పనిచేస్తున్నారట. అలాగే ఈమె బాలీవుడ్ స్టార్స్ కొంతమందికి పర్సనల్ డెర్మటాలజిస్ట్‌గా కూడా పనిచేస్తున్నారు. అందుకేనేమో మహేష్ బాబు ఈ వయసులో కూడా హ్యాండ్సమ్, యోంగ్ అండ్ డైనమిక్ హీరో గా కనిపిస్తున్నాడు. మహేష్ ‘సర్కారు వారి పాట’ చిత్రంలో మీసాలు లేకుండా, కాస్త జులుపాల జుట్టుతో కనిపించనున్నట్లు సమాచారం.