ప్రస్తుతం బాలీవుడ్ ని ఏలుతున్న హీరోయిన్స్ జాబితా లో దీపికా పదుకొనె టాప్ లో ఉంది అని నిస్సందేహంగా చెప్పవచ్చు. సాదారణంగా పెళ్లి తర్వాత హీరోయిన్స్ సినిమాలను వదిలి వారి పర్సనల్ లైఫ్ కి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటారు. లేదా పెళ్లి అయిన కారణంగా సినిమా ఇండస్ట్రీ లో వాళ్ళ జోరు కాస్త తగ్గుతుంది. ఇది ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీ మనం చూస్తున్నాం.కొంతమంది హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా ఒకటి రెండు సినిమాలు చేసినా అంతకుముందు లాగా టాప్ హీరోయిన్ గా కొనసాగలేరు. కాని దీపిక పదుకొనె విషయానికి వస్తే దీనికి పూర్తి విరుద్ధంగా ఉంది. ఈ ముద్దుగుమ్మకి వివాహమయ్యి రెండు సంవత్సరాలు అవుతున్నప్పటికీ బాలీవుడ్ లో మోస్ట్ పెయిడ్ హీరోయిన్ గానే కొనసాగుతూ ఉండడం విశేషం. అంతేకాకుండా అత్యధిక సినిమాలు చేస్తున్న హీరోయిన్స్ జాబితా లో కూడా దీపికా నే ముందు ఉంది.బాలీవుడ్ సూపర్ హీరో షారుఖ్ ఖాన్ తరువాతి చిత్రం పఠాన్ లో దీపికా నే హీరోయిన్ గా నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే వచ్చే ఏడాది ప్రారంభం కానున్న స్టార్ హీరోల సినిమాలలో కూడా దీపిక పదుకొనె నటించబోతున్నట్లుగా సమాచారం. మొత్తంమీద దీపిక పదుకొనె వచ్చే సంవత్సరం దాదాపుగా మూడు నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నది.ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ దీపిక పదుకొనె. సినిమాల తో పాటుగా దీపికా చాలా కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. పెళ్లి తరువాత కూడా ఈమె క్రేజు ఏమాత్రం తగ్గలేదు. బాలీవుడ్ లో దీపికాకు ఉన్న క్రేజ్ తో మరికొన్ని సంవత్సరాల పాటు ఈమె టాప్ హీరోయిన్ గానే కొనసాగనున్నట్లు తెలుస్తుంది.
previous post