శృంగారతార సన్నీలియోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎంత పాపులారిటీ ఉందో అందరికీ తెలిసిందే. అడల్ట్ ఇండస్ట్రీలో నటిగా ఎన్నో అవార్డులను సొంతం చేసుకుంది. ఈ క్రమంలో సన్నీలియోన్ కోట్లలో ఫ్యాన్స్ సంపాదించుకుంది. అయితే అడల్ట్ మూవీస్ చేయడం మానేసి కొత్త జర్నీ మొదలు పెట్టింది. ప్రస్తుతం పలు హిందీ సినిమాలలో హీరోయిన్ గా, స్పెషల్ సాంగ్స్ చేస్తుంది.
ఇక 2011లో హిందీ పాపులర్ రియాలిటీ షో ‘బిగ్ బాస్-5’లో కంటెస్టెంటుగా పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత 2012లో పూజ భట్ దర్శకత్వం వహించిన ‘జిస్మ్ 2’ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా మారింది సన్నీ. హీరోయిన్ గా మొదటి సినిమాతోనే బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకుంది. ఆ తర్వాత కూడా రాగిని ఎం ఎం ఎస్ 2, షారుఖ్ ఖాన్ నటించిన రాయీస్ లో స్పెషల్ సాంగ్ తో పాటు తెలుగులో మంచు మనోజ్ నటించిన కరెంట్ తీగ సినిమాలో గెస్ట్ రోల్..అలాగే రాజశేఖర్ నటించిన గరుడ వేగ లో స్పెషల్ సాంగ్స్ చేసింది.
అటు హిందీ ఇటు తెలుగులోను సన్నీలియోన్ కి మంచి పాపులారిటీ ఉంది. ప్రస్తుతం సన్నీ పెళ్లి చేసుకొని భర్త, పిల్లలతో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది. లాక్ డౌన్ సమయం ఇండియాలోనే గడిపిన ఈ బ్యూటీ ఇటీవలే కాలిఫోర్నియాకి షిఫ్ట్ అయింది. అక్కడ ఫ్రీడమ్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ముంబైలో మాస్క్ పెట్టుకొని సామాజిక దూరం పాటించి ఇబ్బంది పడిన సన్నీ.. అక్కడ మాత్రం భర్తతో.. స్నేహితులతో బీచ్ లలో తెగ ఎంజాయ్ చేస్తోంది.
అంతేకాదు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి ఎప్పుడు అందుబాటులో ఉంటూ తన తన హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా స్నేహితురాలితో స్విమ్మింగ్ చేసిన సన్నీ స్విమ్మింగ్ పూల్ వద్ద బికినీ ధరించిన పిక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ పిక్ బాగా వైరల్ అవుతోంది. స్విమ్ సూట్ ధరించి స్నేహితురాలితో కలిసి సన్నీ గులాబీ రంగు బికినీలో దిగిన సెల్ఫీ ఫోటోలు ఫ్యాన్స్ కి షేర్ చేసింది. ఈ ఫోటోలు చూసి సన్నీ తన లైఫ్ ఎంత హ్యాపీగా ఎంజాయ్ చేస్తుందో అర్ధమవుతుంది… అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఈ ఫోటోని ఫ్యాన్స్ కూడా తెగ షేర్ చేసుకుంటున్నారట.