Leader: లీడర్ సినిమా రానా కంటే ముందు శేఖర్ కమ్ముల చేయాలనుకున్న సూపర్ స్టార్ వీరేనట..!

Share

Leader: దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి రానా హీరోగా పరిచయమైన సినిమా లీడర్. పొల్టికల్ బ్యాక్డ్రాప్‌లో ఈ సినిమాను దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందించారు. 2010లో వచ్చిన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా కూడా విమర్శకుల ప్రశంసలు మాత్రం దక్కించుకుంది. డాలర్ డ్రీంస్, ఆనంద్, గోదావరి, హ్యాపీడేస్ సినిమాలకి దర్శకత్వం వహించిన శేఖర్ కమ్ముల వరుసగా సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత తన వద్ద దర్శకత్వ శాఖలో పనిచేసిన అనీష్ కురివిల్లాను దర్శకుడిగా పరిచయం చేస్తూ ఆవకాయ్ బిర్యాని అనే సినిమాను నిర్మించారు.

shekar-kammula-leader-movie-story-is-discussed-with-super-star-first-than-rana
shekar-kammula-leader-movie-story-is-discussed-with-super-star-first-than-rana

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించినంతగా సక్సెస్ సాధించలేదు. దాంతో ఈసారి డిఫ్రెంట్ జోనర్‌లో సినిమాను చేయాలనుకున్న శేఖర్ కమ్ముల చాలా పక్కాగా అప్పటి రాజకీయ పరిస్థితులను ఆధారంగా చేసుకొని పొల్టికల్ కథాంశంతో లీడర్ సినిమా రూపొందించాలనుకున్నారు. అయితే ఈ సినిమాకి హీరోగా సూపర్ స్టార్ రజనీకాంత్ అయితే బావుంటుందని భావించిన శేఖర్ కమ్ముల ఆయనను కలిసి కథ కూడా చెప్పారట. లీడర్ కథ రజనీకాంత్‌కి బాగా నచ్చడంతో మనం ఈ సినిమా చేద్దాం. కానీ రెండేళ్ళు ఆగాలని అన్నారట. అంతేకాదు ఏవీఎం వారు నిర్మించడానికి కూడా సిద్దమయ్యారని టాక్ వినిపించింది.

Leader: అప్పటికే ఆయన శివాజీ సినిమాను చేస్తున్నారు.

అయితే రజనీకాంత్ రెండేళ్ళు ఆగమని చెప్పింది అప్పటికే ఆయన శివాజీ సినిమాను చేస్తున్నారు. శంకర్ దర్శకుడు అంటే ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేము. అందుకే అంత టైం వెయిట్ చేయమని చెప్పారట. కానీ శేఖర్ కమ్ముల అంత సమయం వేస్ట్ చేసుకోలేక కథలో కొన్ని మార్పులు చేసి సూపర్ స్టార్ మహేశ్ బాబుకి చెప్పాలనుకున్నారట. కానీ మహేశ్ బాబు ఆ సమయంలో వరుస ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్ల సురశ్ ప్రొడక్షన్స్‌లో విక్టరీ వెంకటేశ్ హీరోగా తెరకెక్కించాలని ఫైనల్‌గా డిసైడ్ అయ్యారు. అనుకున్నట్టుగానే శేఖర్ కమ్ముల కథ వెంకటేశ్ – సురేశ్ బాబులకి వినిపించారు.

అయితే కథ సూపర్ గా ఉందని చెప్పిన ఇద్దరు..ఈ సినిమాలో వెంకటేశ్ కాకుండా రానా నటిస్తాడని, కథను దానికి తగ్గట్టు కొన్ని మార్పులు చేయమని చెప్పారట. చాలారోజుల నుంచి రానాని హీరోగా పరిచయం చేసేందుకు సురేశ్ బాబు – వెంకటేశ్ మంచి కమర్షియల్ కథలను వింటున్నారు. కానీ రానా లాంచింగ్‌కి సరైన కథ దొరకలేదు. సరిగ్గా అదే సమయంలో శేఖర్ కమ్ముల చెప్పిన లీడర్ కథ నచ్చి అందులో రానా అయితే లాంచింగ్‌కి పర్‌ఫెక్ట్ అని ప్లాన్ చేశారట. దాంతో మళ్ళీ కొత్త హీరోకి తగ్గట్టుగా శేఖర్ కమ్ముల కథలో కొన్ని మార్పులు చేసి రెడీ అయ్యాడు.

Leader: కమర్షియల్‌గా లీడర్ అంత గొప్ప సక్సెస్ కాలేదు.

అయితే లీడర్ సినిమా షూటింగ్ చాలా నెమ్మదిగా సాగింది. కొన్ని చోట్ల పర్మీషన్స్ దొరకలేదు. మధ్య మధ్యలో గ్యాప్ వచ్చింది. దాంతో రానా ఎంట్రీ మూవీ ఆగిపోయిందనే రూమర్స్ కూడా వచ్చాయి. ఎట్టకేలకి అన్నీ అడ్డంకులు దాటుకొని లీడర్ సినిమా రిలీజైంది. శేఖర్ కమ్ముల మేకింగ్ స్టైల్, రానా పర్ఫార్మెన్స్..ఇందులోని డైలాగ్స్ అన్నీ బాగా కుదిరాయి. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అయితే కమర్షియల్‌గా మాత్రం లీడర్ అంత గొప్ప సక్సెస్ కాలేదు. ఈ సినిమాతోనే రీచా గంగోపాధ్యాయ, ప్రియా ఆనంద్ టాలీవుడ్‌కి హీరోయిన్స్‌గా పరిచయం అయ్యారు. అలా లీడర్ సినిమా అటు కోలీవుడ్ సూపర్ స్టార్, ఇటు టాలీవుడ్ సూపర్ స్టార్స్ చేయాల్సి ఉండగా చివరికి రానా దీనితో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

 


Share

Related posts

మౌనం మాట్లాడింది… మోడీకి మన్మోహన్ హితవు!

CMR

 సందీప్‌రెడ్డికి మాతృవియోగం

Siva Prasad

సోము వీర్రాజు కి తగిలిన ఈ దెబ్బ ఎప్పటికీ మరచిపోలేనిది !

sekhar