Sherbet: బ్రిటీష్ వారి నుండి రక్షణ కోసం మొదలెట్టిన షాప్…. ఇప్పుడు కలకత్తా ఫేమస్ ‘పారమౌంట్ షర్బత్’

Share

Sherbet: స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ వారికి కనపడకుండా ఉండేందుకు మొదలుపెట్టిన ఒక చిన్న తినుబండారాల షాప్ ఇప్పుడు కలకత్తా కాలేజీ స్ట్రీట్ లో స్టూడెంట్స్ కు అడ్డా అయిపోయింది. అందుకు కారణం అక్కడ దొరికే ‘డ్యాం షర్బత్’. కలకత్తాలో చదువుకునే ప్రతి విద్యార్థి కాలేజీ స్ట్రీట్ లో పుస్తకాలు కొనుక్కునే క్రమంలో కచ్చితంగా అక్కడ ఉండే కాఫీ హౌస్, ‘పారామౌంట్ షర్బత్’ ఒక్కసారైనా విచ్చేయక తప్పదు. 103 ఏళ్ల ఘనమైన చరిత్ర కలిగిన ఈ జాయింట్ అక్కడ చదివే ప్రతి విద్యార్థి ఒక తీపి జ్ఞాపకం.

 

రహస్య గదిని కప్పిపుచ్చేందుకు:

కలకత్తాలోని కాలేజీ స్క్వేర్ లో బంకిం చంద్ర చటర్జీ వీధి వద్ద స్వాతంత్ర సమరయోధుడు అయినా nihar ranjan మజుందార్ 1918లో పారామౌంట్ షర్బత్ మొదలుపెట్టారు. పార్ధ ప్రతి మజుందార్ తాతగారు బ్రిటిష్ వారి కళ్ళు కప్పడానికి ఈ ప్రదేశం వెనుక ఉన్న ఒక చిన్న రహస్య గదిని వాడుకున్నట్లు అప్పుడు ఉద్యమకారులంతా అక్కడ రహస్యంగా మీటింగ్ లు జరిపి చర్చించుకునే వారని… బయట మాత్రం సీక్రెట్ రూమ్ ను ఈ తినుబండారాల షాప్ నీ మొదలెట్టారు అని తెలిపారు. అయితే ప్రస్తుతం అక్కడ ఫేమస్ అయిపోయిన మిగిలిన పానీయాలు మాత్రం అప్పటి నుండే బాగా పాపులర్ కావడం మొదలుపెట్టాయి.

నీటితో, పాలతో చేసే 30 వివిధ రకాల చల్లటి పానీయాలలో దాబ్ షర్బత్, గ్రీన్ మ్యాంగో మలై, వనీలా మలై స్టార్ ఐటమ్స్ గా ఎప్పుడూ మెనూ లో ఉంటాయి. సుభాష్ చంద్ర బోస్, , రవీంద్రనాథ్ ఠాగూర్, సత్యజిత్ రే, కాజి నజ్రుల్ ఇస్లాం, అరుంధతీరాయ్, సుచిత్రాసేన్… అలా ఎన్నో తరాల వారు అక్కడికి వచ్చి ఆ షర్బత్ తాగేవారు అంటే అతిశయోక్తి కాదు.

ఇంకా అద్భుతమైన విషయం ఏమిటంటే… దాదాపు వందేళ్ల నుండి ఆ షర్బత్ తయారు చేస్తే రహస్యం మిశ్రమాన్ని వారి కుటుంబీకులు లీక్ కాకుండా కాపాడుకుంటూ వస్తున్నారు. అసలు ఈ మిశ్రమాన్ని వారి తాతగారు, ప్రముఖ కెమిస్ట్ ప్రఫుల్ల చంద్ర రాయ్ గారు కలిసి తయారు చేశారు. కలకత్తా వాతావరణానికి ఇది ఒక యాంటీడాట్ లాగా పనిచేస్తుంది. లేత కొబ్బరి నీళ్ళు, ఐస్, సీక్రెట్ ఫ్లేవర్ తో చేసే డ్యామ్ షర్బత్ అయితే ఇక్కడ ఎంతో ఫేమస్.

Sherbet: నాలుగు అణాల నుండి 80 రూపాయలకి

గతంలో కేవలం నాలుగు అణాలకి కి అమ్మే ఈ షర్బత్ ని ఇప్పుడు విద్యార్థులు 80 రూపాయలు పెట్టి తాగుతారు. ఇక గత కొన్ని సంవత్సరాల నుండి , చాక్లెట్, మిగిలిన అన్ని పండ్లరసాలను అమ్ముతుంటే ఎక్కడా కూడా తమ పేరు పోకుండా కాపాడుకుంటూ వచ్చారు. ఇక్కడ అ బాగా రుచికరమైన షర్బత్ తో పాటు హైదరాబాద్ నిజాముల వద్ద వేలంలో 90 ఏళ్ల క్రితం కొన్న ఎన్నో చారిత్రాత్మక గుర్తులను షాపులో ఉంచడం. గమనార్హం. మొత్తానికి ఇది ఒక మ్యూజియం ను తలపిస్తుంది. తాను మార్పుకి వ్యతిరేకం కాదు కానీ వచ్చే కొత్త కొత్త ఐటమ్ ల లో కూడా తమ బ్రాండ్ కు తగ్గ పానీయాలను ఈ జనరేషన్ కి తగ్గట్టు అందిస్తున్నారు అతని ఫ్యామిలీ.

ఇప్పుడు ఇంటర్నెట్ కాలంలో ఆర్డర్ పెట్టుకునే కుర్రకారంతా అక్కడిదాకా వచ్చి తాగి వెళతారు. ఆఖరికి విదేశాల నుండి కూడా వచ్చినవారు కలకత్తాలో ఒకసారి ఈ షర్బత్ రుచి చూస్తే ఈ పానీయాన్ని భారతదేశానికి మరలా వచ్చినప్పుడు తాగకుండా . ఇంకా ఎంతో సహజంగా ఎలాంటి హంగామా లేకుండా ఈ పని చేయడం ఈ ఫ్రాంచేజీ ఇంత అభివృద్ధి చెందిందని… అసలు నిరాడంబరమైన లక్ష్యమే ఈ చరిత్ర మొదలు కావడానికి కారణం అని చెప్తున్నారు ముజుందార్.


Share

Related posts

జగన్ వైపు స్టీరింగ్ తిప్పిన ఏ‌బి‌ఎన్ రాధాకృష్ణ… ఉలిక్కిపడిన ఏపీ!

CMR

Tirupati By Poll: ప్రతిపక్షాలకు హైకోర్టులో షాక్..

somaraju sharma

కేసీఆర్ నుండి జగన్ నేర్చుకోవాల్సినవి ఎన్నెన్నో!

Yandamuri