షిర్డీ – కాకినాడ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. షిర్డీ నుండి కాకినాడ బయలుదేరిన ఎక్స్ ప్రెస్ రైలు సిగ్నల్ కోసం మహారాష్ట్రలోని పర్బణి స్టేషన్ సమీపంలో ఆగింది. ఇదే అదునుగా దోపీడీ దొంగలు బోగీలోకి ప్రవేశించారు. మహిళా ప్రయాణీకులను బెదరించి వారి మెడలోని గొలుసులు లాగేసుకున్నారు. ఎస్ 2 నుండి ఎస్ 11 బోగీ వరకూ మహిళలే టార్గెట్ గా దోపిడీ చేశారు. దాదాపు 30 మంది ప్రయాణీకుల నుండి బంగారం దోచుకువెళ్లారు.

దీంతో బాధితులు లోబోదిబో మంటూ పర్బణి స్టేషన్ లో ఆర్‌పీఎఫ్ కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దోపిడీ దొంగలను పట్టుకునేందుకు రైల్వే పోలీసులు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఇటువంటి ఘటనలు జరుగుతుండేవి. అయితే ఇటీవల కాలంలో రైళ్లలో దోపిడీ దొంగల స్వైర విహారం లేకపోవడంతో ప్రయాణీకులు నిర్బయంగా ప్రయాణాలు చేస్తున్నారు. తాజా ఘటనతో ప్రయాణీకులు ఆందోళన చెందుతున్నారు.
సీఎం సన్నిహిత నేతల నివాసాల్లో ఈడీ సోదాలు .. ఆ సీఎం స్పందన ఇదీ