23.2 C
Hyderabad
December 6, 2022
NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

Shiva Statue: అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం ఇండియాలోనే ఏర్పాటు.. దాని ఎత్తు 369 అడుగులు!! 

Share

Shiva Statue: అవును, మీరు విన్నది నిజమే. రాజస్థాన్‌లోని రాజసమంద్‌ జిల్లా నాథ్‌ద్వారా పట్టణంలో అత్యాధునిక హంగులతో నిర్మింపబడిన అక్షరాలా 369 అడుగుల ఎత్తైన మహాశివుడి విగ్రహం ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. కాగా ఇది ప్రపంచంలో అత్యంత ఎత్తైన విగ్రహంగా నేటినుండి కీర్తి గడించనుంది. విశ్వాస్‌ స్వరూపంగా పేర్కొన్న ఈ విగ్రహాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త అయినటువంటి మొరారి బాపు, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్ పలువురు ప్రముఖుల సమక్షంలో ప్రారంభించనున్నారు.

Shiva Statue: ఓ కొండపై ఏర్పాటు

Shiva Statue

ఇకపోతే ఈ విగ్రహం ఉదయ్‌పూర్‌కు సుమారు 45 కిలోమీటర్ల దూరంలో కలదు. విగ్రహ ప్రారంభోత్సవ సందర్భంగా అక్కడ దాదాపు 9 రోజుల పాటు వివిధ సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ ఎత్తైన విగ్రహాన్ని ‘తత్ పదం సంస్థాన్’ అనే సంస్థ నిర్మించింది. ఈ విగ్రహ ప్రతిష్టాపన అనంతరం నేటి నుంచి 9 రోజుల పాటు ధార్మిక కార్యక్రమాలు అక్కడ కొనసాగనున్నాయి. ఈ 9 రోజుల కార్యక్రమంలో ఆధ్యాత్మిక వేత్త మొరారీ బాపు రామ్‌ కథను పఠిస్తారు. దాదాపు 32 ఎకరాల విస్తీర్ణ భూభాగంలో ఓ కొండపై ఏర్పాటు చేసిన శివుడి విగ్రహం జనులకు దర్శనం ఇవ్వనుంది.

నిర్మాణ విశేషాలు ఇవే

Shiva Statue

కాగా ఈ విగ్రహాన్ని నిర్మించేందుకు 3 వేల టన్నుల స్టీల్‌, 2.5 లక్షల క్యూబిక్‌ టన్నుల కాంక్రీట్‌, ఇసుకను వినియోగించడం జరిగింది. కాగా ఈ భారీ విగ్రహాన్ని నిర్మించేందుకు సుమారు 10 సంవత్సరాల సమయం పట్టింది. ఈ ప్రాజెక్టకు 2012 ఆగస్టులో శంకుస్థాపన జరగగా అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న అశోక్‌ గహ్లోత్‌, మొరారి బాపు ఆధ్వర్యంలోనే భూమి పూజ అక్కడ నిర్వహించారు. అలాగే ఈ విగ్రహాన్ని 250 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులను తట్టుకునే సామర్థ్యంతో నిర్మించడం విశేషం. ఈ విగ్రహం చుట్టూ ఉన్న ప్రాంతంలో బంగీ జంపింగ్, జిప్ లైన్, గో-కార్ట్, ఫుడ్‌ కోర్టులు, అడ్వెంచర్‌ పార్కు, జంగిల్‌ కేఫ్‌ వంటి వాటిని ఏర్పాటు చేశారు.


Share

Related posts

తెలంగాణలో కూడా కొడాలి నాని లాంటి మంత్రి తయారయ్యాడే!దుమారం రేపుతోన్న ‘పువ్వా’డ వ్యాఖ్యలు!

Yandamuri

YS Jagan : జ‌గ‌న్ న‌మ్మినబంటు చేసిన ఎందుకు ఇలాంటి చాలెంజ్ చేయాల్సి వ‌చ్చిందో?

sridhar

Fau g : పబ్‌జీకి ప్రత్యామ్యాయం వచ్చేసిందోచ్..!! దీని ప్రత్యేకతలు ఇవే..!!

bharani jella