పెళ్లి సెట్ చేయడమేంట్రా.. నేనేమన్నా బ్రోకరా? శివశంకర్ మాస్టారు ఫైర్

మీకు ఢీ 10 డ్యాన్సర్ పండు తెలుసు కదా. ఈ మధ్య దుర్గారావు స్టెప్పులేసి, లేడీ గెటప్ వేసి తెగ ఫేమస్ అయ్యాడు. ఈ మధ్య కామెడీ షోలలోనూ మెరుస్తున్నాడు. మంచి డ్యాన్సరే. కామెడీ కూడా పండిస్తున్నాడు ఈ మధ్య.

shivashankar master make fun with Dhee dancer pandu
shivashankar master make fun with Dhee dancer pandu

తాజాగా జీ తెలుగు బొమ్మ అదిరింది షోలో గెస్ట్ గా వచ్చిన పండు.. కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టార్ తో కలిసి కాసేపు సరదాగా ప్రేక్షకులను నవ్వించాడు.

జీ తెలుగులో అదిరింది షోను బొమ్మ అదిరిందిగా మార్చిన సంగతి తెలిసిందే. ఈ షోకు ప్రస్తుతం శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తుండగా… నాగబాబు, జానీ మాస్టర్ జడ్జిలుగా వ్యవహరిస్తున్నారు.

ఇక.. స్టేజీ మీదికి శివశంకర్ మాస్టారు రాగానే.. శ్రీముఖితో.. మా గురూజీ ఈయన అంటూ పండు పరిచయం చేస్తాడు. మా గురూజీ నాకు పెళ్లి సెట్ చేయడానికి వచ్చాడు.. అంటూ పండు చెప్పగానే.. పెళ్లి సెట్ చేయడం ఏంట్రా.. నేనేమన్నా బ్రోకర్ నా? అని అనగానే స్టేజీ మీద నవ్వులే నవ్వులు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

అయితే.. అది ఫన్నీగా నవ్వించడం కోసమే చేసినా.. డ్యాన్సర్లు కూడా ఈమధ్య కమెడియన్లుగా మారి.. బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారనడంలో సందేహం లేదు.