NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ బిగ్ స్టోరీ

ఇవి మనుషులు తాగే నీళ్లా ? ఏలూరు శాంపిల్స్ చూసి విస్తుపోయిన శాస్త్రవేత్తలు

 

కనీసం జంతువులూ ఈ నీళ్లు తాగినా బతకవు.. ఇలాంటి నీటిని తాగితే ఇప్పటికిప్పుడు కాదు భవిష్యత్తు అంతా అంధకారమే … ఫీట్స్ ఎం కర్మ … క్యాన్సర్ తో పాటు భయంకర రోగాలు రాక తప్పవు. భవిష్యత్తు తారలు లోపాలతో పుడతారు అంటూ … ఏలూరు వింత వ్యాధిపై పరిశోధన చేస్తున్న వైద్యులు నోరెళ్ళ బెట్టారు .. నీటి శాంపిల్స్ పరిశీలించిన వారికీ దానిలో ఉన్న విష పదార్ధాలను చూసి ఎం మాట్లాడాలో ఎం నివేదించాలో కూడా అంటూ పట్టకుండా ఉంది .. నీటిలో అన్ని రకాల లోపాలు ఉన్న ఈ నీటిని తాగటం వాళ్ళ న్యూరో సమస్యలే కాదు ఇంకా భయంకర రోగాలు వస్తాయని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నారు ..

ఏలూరు వింతవ్యాధికి గల కారణాలను తేల్చేందుకు పంపుతున్న శాంపిల్స్‌ను పరీక్షిస్తున్న డాక్టర్లు విస్తుపోతున్నారు. అసలు ఇలాంటి పరిస్ధితుల్లో జనం అక్కడ ఎలా బతుకుకున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. నీటి కాలుష్యమే ఈ వింతవ్యాధికి కారణమని నిర్దారణ అవుతుండగా… ఇందులో క్రిమిసంహారకాల శాతం ఎన్నో రేట్లు ఎక్కువగా ఉంది . తాగే నీరు కనీసం పశువులను కడిగేందుకు కూడా పనికి రాదని అర్ధం అవుతోంది. రా వాటర్ ను , ఫిల్టర్ చేసిన నీటిని రెండు రకాలుగా పరీక్షించిన ఇవే రకాల ఫలితాలు వచ్చాయి.

ఏలూరు గొంతు నిండా గరళమే

ఏలూరు కడుపు నిండా గరళం నిండిపోయింది. ఏలూరు చుట్టుపక్కల ఎక్కువగా క్రైం ఐ సంహారకాలు వాడటం , వాటిని ధారాళంగా ఏలూరు మంచి నీటి కాలువ అయినా కృష్ణ కాలువలో వదలడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తింది. తాజాగా బయటపడిన వింతవ్యాధికి గల కారణాలను వెలికితీసేందుకు ఎయిమ్స్‌, డబ్లూహెచ్‌వో, సీసీఎంబీ వైద్య శాస్త్రవేత్తలు ప్రయత్నాల్లో పలు వింత విషయాలు బయటకు వస్తున్నాయి . ముందుగా రోగుల శరీరాల నుంచి సేకరించిన శాంపిల్స్‌ పరీక్షించినప్పుడు వాటిలో సీసం, నికెల్‌ ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు, ఇప్పుడు నీటి నమూనాలను పరీక్షిస్తే మరిన్ని విభ్రాంతికర వాస్తవాలు బయటికొచ్చాయి.

** నీరు దారుణంగా కలుషితమైందని, వైరస్ ఆనవాళ్లు లేకపోయినా పురుగుమందుల అవశేషాలు మాత్రం వేల రెట్లు అధికంగా ఉన్నాయని నిర్ధారణ అవుతోంది. దీంతో వీటిని మరింత లోతుగా పరీక్షించేందుకు డాక్టర్లు సిద్ధమవుతున్నారు.

దారుణంగా కృష్ణా, గోదావరి నీరు..

ఏలూరుకు కృష్ణా, గోదావరి నదుల నుంచి నీళ్లు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాలకు కృష్ణా కాలువ నీరు, మరికొన్ని ప్రాంతాలకు గోదావరి నీళ్లను తాగునీరుగా మార్చి అందిస్తున్నారు. ఈ రెండు నదుల నీళ్ల నుంచి సేకరించిన శాంపిల్స్‌లోనూ క్రిమిసంహారకాలు వేల రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. వీటిలో కలుపుమొక్కల నివారణకు వాడే మందులతో పాటు దోమలు, ఈగలు, బొద్దింకల నివారణకు వాడేవి, పంటల్లో చీడపీడల నివారణకు వాడే అలాక్లోర్‌, ఓపీ-డీడీటీ, పీపీ-డీడీఈ వంటి ప్రమాదకర రసాయనాలు ఈ నీళ్లలో ఉన్నట్లు తేలింది.

**కృష్ణా, గోదావరి కాలువల్లో అలాక్లార్‌ లీటర్‌కు సగటున 10 మిల్లీ గ్రాములకు పైగా ఉండగా.. పెన్షన్‌ లైన్ నీళ్లలో అలాక్లోర్‌ 14 మి.గ్రాములు, ఓపీ-డీడీటీ 15 మిల్లీగ్రాములు, జేపీ కాలనీలో పీపీ-డీడీఈ 14 మిల్లీగ్రాములు, ఓపీ-డీడీటీ 15 మిల్లీ గ్రాములు, గాంధీ కాలనీలో ఓపీ-డీడీడీ 14 మిల్లీగ్రాములు, పీపీ-డీడీడీ 15 మిల్లీగ్రాములు, రామచంద్రరావుపేటలో అలాక్లోర్ 10 మిల్లీగ్రాములు, ఓపీ-డీడీఈ 13.37 మిల్లీగ్రాములున్నట్లు తేలింది.

17 వేల రెట్లు ఎక్కువగా రసాయనాలు..

ఏలూరు కృష్ణా కాలువ నుంచి సేకరించిన నీటి నమూనాల్లో మెథాక్లీక్లోర్‌ ఏకంగా 17 వేల640 రెట్లు ఎక్కువగా ఉందని డాక్టర్లు తేల్చారు. తాగునీటిలో ఈ రసాయనం అసలు ఉండకూడదు. ఒకవేళ ఉన్నా కేవలం 0.001 మిల్లీ గ్రాములకు మించకూడదు. కానీ తాజా శాంపిల్స్‌ పరీక్షల్లో ఇది 17.64 మిల్లీ గ్రాములున్నట్లు తేలడం డాక్టర్లను సైతం కలవరపెడుతోంది.

**ఏలూరులో దాదాపు ఆరు ప్రాంతాల్లో నీటి నమూనాలను సేకరించి పరీక్షించగా.. అన్ని చోట్లా దాదాపు ఒకే ఫలితాలు రావడంతో జనాల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. కొన్నేళ్లుగా నగరానికి సరఫరా అవుతున్న కృష్ణా, గోదావరి జలాలు విషతుల్యం కావడం వల్లే రోగుల శరీరాల్లో సీసం, నికెల్‌ చేరినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ప్రభుత్వాల నిర్లక్ష్యం, రైతుల విచ్చలవిడితనం బయటికొస్తున్నాయి.

శాంపిల్స్‌ చూసి విస్తుపోతున్న డాక్టర్లు..

ఏలూరు నుంచి పలు ల్యాబ్‌లకు వెళ్తున్న శాంపిల్స్‌ పరీక్షిస్తున్న డాక్టర్లు నిర్ఘాంతపోతున్నారు. ఏలూరులో ఎన్నేళ్లుగా ఇలాంటి నీటిని జనం వాడుతున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇంతటి హానికర రసాయనాలు నీటిలో ఉండేందుకే వీల్లేదని, అలాంటిది వేల రెట్లు ఎక్కువగా ఉండటం, దాన్ని కొన్నేళ్లుగా అలాగే వాడేస్తుండటంతో జనం శరీరాల్లో భారీగా సీసం, నికెల్‌ అవశేషాలు ఉండొచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం రోగులుగా మారిన వారితో పాటు ఇతరులను కూడా పరీక్షించాల్సిన అవసరం ఉందని వారు చెబుతున్నారు. మరి ప్రభుత్వం అందుకు సిద్ధమవుతుందా లేక తీవ్రత బయటపడితే అభాసుపాలు కావాల్సి వస్తుందని వదిలేస్తుందా చూడాల్సి ఉంది.

author avatar
Special Bureau

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju