ట్రెండింగ్ న్యూస్ సినిమా

ఎయిర్ పోర్టులో మోనాల్ కి షాక్..! ఆమెను అలా అనేసరికి బాధేస్తుంది అంట

Share

బిగ్బాస్ ఇంట్లో బాగా ఫేమస్ అయిన లేడీ కంటెస్టెంట్ లలో హారిక, అరియానా, మోనాల్ ముందు వరుసలో ఉంటారు. అలాంటి ఫేమస్ సెలబ్రిటీని పక్క నెట్టి వీరు ముగ్గురు జనాల్లో సంపాదించిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. ఇక గ్లామరస్ హీరోయిన్ గా తెలుగు వారికి పరిచయమైన గుజరాతి బ్యూటీ మోనాల్ ఈ షో ద్వారా బాగా పాపులర్ అయింది. పైగా ఆమె ఇంటిలో నడిపిన లవ్ ట్రాక్ లు విపరీతమైన క్రేజ్ తెచ్చి పెట్టాయి.

 

ఈ నేపథ్యంలో తాజాగా ఆమెకు ఒక ఊహించని అనుభవం చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…. ఏ మాత్రం అంచనాలు లేకుండా ఇంట్లోకి అడుగుపెట్టిన మోనాల్ ఎవరూ ఊహించని విధంగా 14 వారాల పాటు ఇంటిలో కొనసాగింది. ఫినాలే ముందు వారం ఇంటి నుండి బయటకు వెళ్లి పోయిన ఈ గుజరాతి ముద్దుగుమ్మ ఫుల్ బిజీ అయిపోయింది. అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటెం సాంగ్ కూడా చేసింది. ఇక కోసం హైదరాబాద్ వచ్చిన ఈ బ్యూటీ చాలా గ్యాప్ తర్వాత అహ్మదాబాద్లో తన నివాసానికి వెళ్ళింది.

కొద్ది రోజులు ఎంజాయ్ చేసి మళ్ళీ జంటనగరాలకు తిరిగి చేరుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె హైదరాబాద్ ఎయిర్ పోర్టులో నన్ను చూసి అందరూ అఖిల్ ఎలా ఉన్నాడు అని అడుగుతున్నారు అని చెప్పింది. అంతేకాకుండా వారు అలా కామెంట్ చేయడం పై స్పందించిన మోనాల్ గతంలో నన్ను అసలు ఎవరు గుర్తు పెట్టేవారు కాదు…. ఇప్పుడు అందరూ మోనాల్… మోనాల్ అంటున్నారు . నీ అఖిల్ పేరు అడగడం మాత్రం నాకు బాధిస్తోంది అని చెప్పింది.


Share

Related posts

Tooth Paste : మీరు వాడే టూత్ పేస్ట్ తోనే  మీ పిల్లలకు బ్రష్ చేయిస్తున్నారా ?

siddhu

అందరూ అడుక్కునే వాళ్లే..! జబర్దస్త్, అదిరింది పై హైపర్ ఆది సెన్సేషనల్ కామెంట్స్..?

arun kanna

Bigg Boss 5 Telugu: రెండో రోజే ఆ టాప్ యాంకర్ కి వార్నింగ్ ఇచ్చిన లోబో..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar