NewsOrbit
న్యూస్ సినిమా

సుజీత్ కి షాక్.. మెగాస్టార్ లూసిఫర్ తెలుగు రీమేక్ కి రంగంలోకి దిగిన దర్శకుడు ..!

Share

సక్సస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ఆచార్య. ఈ సినిమాని మెగాస్టార్ తనయుడు రాం చరణ్ సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా ..రెజీనా కసాండ్ర ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ఇక ఈ సినిమాకి మణిశర్మ సంగీతమందిస్తున్నారు.

 

VV Vinayak in need of a hero!

ఆగస్టు 22 న ఆచార్య సినిమా నుంచి టైటిల్ తో పాటు చిరంజీవి ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. రాం చరణ్, దర్శకుడు కొరటాల శివ అందుకు తగు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా 40 శాతం టాకీపార్ట్ అండ్ ఒక సాంగ్ కంప్లీట్ అయింది. త్వరలో మళ్ళీ షూటింగ్ ని ప్రారంభిస్తారని అంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మరో సినిమా మలయాళ సూపర్ హిట్ లూసీఫర్ తెలుగు రీమేక్. ఈ సినిమాని యంగ్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించబోతున్నాడని అందరికీ తెలిసిందే. ఇప్పటికే సుజీత్ పక్కా స్క్రిప్ట్ సిద్దం చేసే పనిలో ఉన్నాడని …ఇటీవల సుజీత్ మెగాస్టార్ మధ్య స్క్రిప్ట్ కి సంబంధించి చర్చలు కూడా జరిగాయట.

అయితే తాజా సమాచారం ప్రకారం ఆ చర్చల్లో సుజీత్ చెప్పిన వర్షన్ చిరు కి నచ్చకపోవడంతో ఇప్పుడు లూసీఫర్ తెలుగు రీమేక్ బాధ్యతలు చిరంజీవి వి వి వినాయక్ కి అప్పగించారట. ప్రస్తుతం వినాయక్ ఈ సినిమాకి సంబంధించి స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేస్తున్నాడట. అక్టోబర్ లో ఈ సినిమాని అధికారకంగా ప్రకటించనున్నారని సమాచారం. మెగా పవర్ స్టార్ రాం చరణ్ ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా నిర్మించబోతున్నాడు. గతంలో వినాయక్, మెగాస్టార్ కాంబినేషన్ లో వచ్చిన ఠాగూర్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.


Share

Related posts

SEC : బ్రేకింగ్ :పంచాయతీ ఎన్నికల టీడీపీ మేనిఫెస్టోను రద్దు చేసిన ఎస్ఈసీ

somaraju sharma

స్టేజీ పై అలా పిలిచేసరికి వర్ష ని హత్తుకొని ముద్దు పెట్టేసిన జబర్దస్త్ ఇమాన్యుయెల్…!

arun kanna

Karthika Deepam Feb 9 Today Episode: సౌందర్య మామూలుది కాదుగా.. రుద్రాణికి చుక్కలు చూపించిందిగా..?

Ram