షాకిచ్చిన అనిల్ రావిపూడి ..అన్నిటికి చెక్ పెడుతూ ఎఫ్ 3 షూటింగ్ కి డేట్ ఫిక్స్..?

Share

విక్టరీ వెంకటేష్ – మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన భారీ మల్టీస్టారర్ ఎఫ్ 2. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ సమపాళ్ళలో చూపించిన దర్శకుడు అనిల్ రావిపూడి భారీ హిట్ అందుకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియోషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా 100 కోట్ల వసూళ్ళు రాబట్టి రికార్డ్ సాధించింది. దాంతో ఈ సినిమాకి సీక్వెల్ గా ఎఫ్ 3 తీయాలని దిల్ రాజు – దర్శకుడు అనిల్ రావిపూడి – వెంకటేష్ – వరుణ్ తేజ్ అప్పుడే డిసైడయ్యారు.

F2 Fun and Frustration Review - tollywood

అయితే ఎఫ్ 2 తర్వాత దిల్ రాజు – అనిల్ రావి పూడి కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరు సినిమా చేశారు. ఈ ఏడాది ప్రారంభంలోనే వచ్చిన ఈ సినిమా భారీ సక్సస్ అందుకుంది. ఇక వెంకటేష్ వరుణ్ తేజ్ కూడా గద్దల కొండ గణేష్, వెంకీ మామ లతో సక్సస్ లు అందుకున్నారు. ప్రస్తుతం వెంకటేష్ తమిళ సూపర్ హిట్ సినిమా అసురన్ రీమేక్ నారప్ప లో నటిస్తున్నాడు. ఇక యంగ్ హీరో వరుణ్ తేజ్ బాక్సర్ అన్న సినిమా చేస్తున్నాడు. కాగా ఈ సినిమాల తో పాటు ఇప్పుడు సక్సస్ ఫుల్ సినిమా హిట్ ఎఫ్ 2 కి సీక్వెల్ ఎఫ్ 3 లో నటించబోతున్నారు.

దిల్ రాజు నిర్మాణంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎఫ్ 3 ఈ డిసెంబర్ లో ప్రారంభం కాబోతుందని తాజా సమాచారం. ఇందుకోసం దర్శక, నిర్మాతలు డేట్ కూడా ఫిక్స్ చేశారట. డిసెంబర్ 14 న ఈ సినిమా ప్రారంభం కాబోతుందట. అంతేకాదు 2021 సమ్మర్ లేదా దసరా పండుగ సందర్భంగా రిలీజ్ చేసే అవకాశాలున్నాయని సమాచారం. ఇక ఎఫ్ 2 కి అదిరిపోయో ఆల్బం ఇచ్చిన రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ ఎఫ్ 3 కి సంగీతమనించబోతున్నాడట. ఇప్పటికే ఎఫ్ 3 స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో సిద్దం చేశాడ అనిల్ రావిపూడి.


Share

Related posts

AditiRavi Cute Wallpapers

Gallery Desk

Comedy Stars : ఇంట్లో ఏం చేతగాదు.. స్టేజ్ మీద మాత్రం బాగానే చేస్తాడు.. అవినాష్ ను ఆడుకున్న సుజాత? English Title : Comedy S

Varun G

గిఫ్ట్ స్మార్టే కానీ నిజం వర్‌స్ట్

Siva Prasad