Cine Politics: సినీ గ్లామర్ కి షాక్..! రాజకీయాల్లో రాణించలేని హీరోల లిస్ట్ ఇదే..!!

Share

Cine Politics: రాజ‌కీయాలు వేరు – సినిమాలు వేరు. కెమెరా ముందు విశ్వ‌రూపం చూపించే న‌టులు, రాజ‌కీయాల్లోకి అడుగుపెడితే త‌డ‌బ‌డ‌తారు. ఇందుకు ఎన్నో ఉదాహ‌ర‌ణ‌లు. తాజాగా దేశంలో జ‌రిగిన ఎన్నిక‌లు, వాటి ఫ‌లితాలు చూస్తే… అది మ‌రోసారి నిజ‌మ‌ని తేలిపోతుంది.

Shock to cine glamour in Politics ..!
Shock to cine glamour in Politics ..!

ఆంధ్రప్రదేశ్లోనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మొన్నటి ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఘోరంగా ఓడిపోవటం తెలిసిందే .అదే సీన్ ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా పునరావృతమైంది. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలిసిన ముగ్గురు సినీ ప్రముఖులు కూడా ఈ ఎన్నికల్లో మట్టి కరిచారు.

Cine Politics: కమల్ హాసన్ ని కాదన్న ఓటర్లు!

ఈ ఎన్నిక‌ల్లో కాక‌లు తీరిన స్టార్లు… ప‌రాజ‌యం పాల‌య్యారు. తెలుగులో సాగర సంగమం, సొమ్మొకడిదిసోకొకడిది, మరో చరిత్ర , ఆకలి రాజ్యం వంటి సూపర్హిట్ చిత్రాల ద్వారా మనకందరికీ తెలిసి.. తమిళనాడులో రజినీకాంత్ తర్వాత అంతటి ఫాలోయింగ్ కలిగిన కమల్ హాసన్ ఈ ఎన్నికల్లో భంగపడ్డారు. పోటీ చేసిన తొలిసారే ఆయన పరాజయం పాలయ్యారు మక్కల్‌ నీది మయ్యమ్ పార్టీ స్థాపించి, త‌మిళ‌నాట అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో పోటీ చేసిన క‌మ‌ల్ హాస‌న్‌… ఎం.ఎల్‌.ఏగా ఓడిపోయారు.కోయంబత్తూరు సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన సమీప ప్రత్యర్థి వనతి శ్రీనివాసస్‌(బీజేపీ)పై 1300 ఓట్ల తేడాలో ఓట‌మి పాల‌య్యారు.

పని చేయని ఖుష్బూ గ్లామర్!

తమిళనాడులో తిరుగులేని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఖుష్బూకీ ఓట‌మి త‌ప్ప‌లేదు. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు .కలియుగపాండవులు చిత్రంతో తెలుగులో వెంకటేష్ తో కలిసి ఆమె వెండితెరపై వెలిగారు.నిన్న మొన్న చిరంజీవి నటించిన స్టాలిన్ లో కూడా ఖుష్బూ కీలక పాత్ర పోషించారు. ఆమెకి తమిళంలో ఎంత ఫాలోయింగ్ ఉందంటే గతంలో స్టార్ హీరోయిన్ గా ఉండగా ఖుష్బూకి గుడి సైతం కట్టారు థౌజండ్‌ లైట్స్‌ అసెంబ్లీ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఖుష్బూ తన సమీప ప్రత్యర్థి డీఎంకే నేత ఎళిలన్ చేతిలో ఓటమి పాలయ్యారు.

సురేష్ గోపి రెండోసారి ఓటమి!

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి, నటుడు సురేశ్‌ గోపీ ఓడిపోయాడు. మోహన్ లాల్ ,మమ్ముట్టి తరవాత కేరళలో టాప్ ప్లేస్ లో ఉన్న హీరో సురేష్ గోపి .తెలుగులో విడుదలైన ఆయన అనేక అనువాద చిత్రాలు హిట్ కూడా అయ్యాయి.అయితే వరుసగా రెండోసారి కూడా ఆయన గెలవలేకపోయారు. త్రిస్సూర్‌ నియోజకవర్గంలో మొద‌ట్లో ఆధిక్యంలో ఉన్న సురేశ్ గోపీ చివ‌రికి మూడోస్థానంతో స‌రిపెట్టుకున్నారు.మొన్నటి ఎన్నికల్లో ఆయన లోక్సభకు పోటీ చేసి ఓడిపోయారు.


Share

Related posts

చిరంజీవి ఆచార్య : రిలీజ్ డేట్ లాక్ చేసిన కొరటాల శివ ? హిట్టు సినిమా పక్కా ??

GRK

అమ్మ ఒడి పధకం పై క్లారిటీ ఇచ్చిన మంత్రి ఆదిమూలపు సురేష్

somaraju sharma

Ys Jagan Mohan Reddy : మధ్యతరగతి ప్రజలపై భారం దించడానికి జగన్ సరికొత్త ఐడియా..!!

sekhar