NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

మోదీ కొత్త ఎత్తుగ‌డ‌కు కేసీఆర్ షాక్ అవ్వాల్సిందే ..

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ప్ర‌చార ఉధృతి కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ టార్గెట్‌గా చేసుకొని బీజేపీ ముందుకు సాగుతోంది. ఈ రెండు పార్టీల మ‌ధ్య విమ‌ర్శ‌లు ప్ర‌తి విమ‌ర్శ‌లు సాగుతున్నాయి.

 

తాజాగా కొత్త గేమ్‌తో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై ప్రధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ త‌న వ్యూహాన్ని అమ‌లు చేస్తున్నార‌ని అంటున్నారు. తాజాగా ప్ర‌ధాని హైద‌రాబాద్ టూర్ నేప‌థ్యంలో ఈ చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది.

హైద‌రాబాద్‌కు మోదీ

కరోనా వైరస్ కట్టడి చేయాలంటే తప్పనిసరిగా వ్యాక్సిన్ రావాల్సి ఉండ‌గా ఇండియాలో నాలుగు కరోనా వ్యాక్సిన్ లు తయారవుతున్నాయి. హైదరాబాద్ లోని భారత్ బయోటెక్, ఐసిఎంఆర్ సంస్థలు కలిసి కొవాగ్జిన్ వ్యాక్సిన్ ను తయారు చేస్తున్నాయి. ఈ వ్యాక్సిన్ మూడో దశ ట్రయల్స్ ఉంది. మొదటి రెండు దశల్లో మంచి ఫలితాలు ఇవ్వడంతో మూడో దశ ట్రయల్స్ కూడా ఆశాజనకంగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తున్న వ్యాక్సిన్ పురోగతిని పరిశీలించేందుకు ఈనెల 28వ తేదీన ప్రధాని మోడీ హైదరాబాద్‌కు రాబోతున్నారు. ఈ నెల 28వ తేదీన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో హకీంపేటకు వస్తారు. అక్కడి నుంచి భారత్ బయోటెక్ సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు.

ఇప్పుడే మోదీజీ ఎందుకు వ‌స్తున్నారు?

 

ప్రస్తుతం హైదరాబాద్ లో గ్రేటర్ ఎన్నికల హడావుడి ఉంది. ఎన్నికల ప్రచారానికి అదే చివరి రోజు కావడంతో మోడీ రాకపై ఆసక్తి నెలకొంది. భారత్ బయోటెక్ సంస్థ కార్యక్రమం తరువాత మోడీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా లేక ఆ కార్యక్రమంలో పాల్గొని వెళ్ళిపోతారా అన్న చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది. మ‌రోవైపు , మోదీ రాక మాత్రం ప్ర‌చారంలో భాగ‌మ‌ని చెప్తున్నారు. ఇదిలాఉండ‌గా, జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో కలిసి మ‌హారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ విడుద‌ల చేశారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఫడ్నవిస్ తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర చాలా ఉందన్నారు. ప్రజలకు ఏం కావాలో తాము అర్థం చేసుకున్నామన్నారు. ప్రజలతో మాట్లాడి మేనిఫెస్టో తయరు చేశామన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణకు స్వాతంత్ర్య దినోత్సవమన్నారు.

author avatar
sridhar

Related posts

TDP Leaders Protest: అనంత టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి .. పార్టీ కార్యాలయం ధ్వంసం .. బ్యానర్లు, ఫ్లెక్సీలకు నిప్పు

sharma somaraju

Ranbir Kapoor: కూతురు రాహాకు ల‌గ్జ‌రీ బంగ్లాను గిఫ్ట్‌గా ఇచ్చిన‌ రణ‌బీర్ కపూర్.. ఎన్ని కోట్లో తెలిస్తే క‌ళ్లు చెదిరిపోతాయ్‌!!

kavya N

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju