Subscribe for notification

మోదీకి జ‌గ‌న్ షాక్‌…క‌ల‌లో కూడా ఊహించ‌లేదేమో!

Share

`బ్రేకింగ్ : బీజేపీ సార‌థ్యంలోని ఎన్‌డి‌ఏలోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి ఆహ్వానం. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఈ మేర‌కు ప్ర‌క‌ట‌న వెలువ‌డే చాన్స్‌`

ఈ మేర‌కు వివిధ మీడియా సంస్థ‌ల్లో రెండ్రోజుల నుంచి జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అంతేకాకుండా దీనికి కొన‌సాగింపుగా, ఎన్డీఏ జగన్ పార్టీకి మంత్రి పదవుల్ని ఆఫర్ చేసిందని.. అందుకే ఆయన సడన్‌గా ఢిల్లీ వెళుతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ ప్ర‌చారంలో ఊహించ‌ని వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది.

జ‌గ‌న్ ఇలా వార్త‌ల్లోకి ఎందుకంటే…

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ ఢిల్లీ టూర్ అంటే చాలు కొన్ని మీడియా సంస్థ‌లు ఒక రెడీగా ఉన్న క‌థ‌నం వ‌డ్డిస్తాయని వైసీపీ నేత‌లు అంటున్నారు. వైసీపీకి కేంద్ర కేబినెట్‌లో ఛాన్స్ ఇచ్చారు. జగన్ పార్టీకి మంత్రి పదవుల్ని ఆఫర్ చేసిన ప్ర‌ధాన‌మంత్రి…అందుకే ఆయన సడన్‌గా ఢిల్లీ వెళుతున్న సీఎం అంటూ జోరుగా ప్రచారం చేస్తార‌ని విశ్లేషిస్తున్నారు. అయితే, త‌మ నాయ‌కుడి ఢిల్లీ ప‌ర్య‌ట‌న పూర్తిగా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోస‌మేన‌ని చెప్తున్నారు.

హైకోర్టులో అలా జ‌ర‌గ‌డం…

ఏపీలో పాలనా వికేంద్రీకరణ పేరిట అక్కడ శాసన రాజధాని అనేదాన్ని మాత్రం కొనసాగిస్తూ పాలనా రాజధానిని విశాఖకు తరలించాలని, న్యాయ రాజధాని పేరుతో కర్నూలుకు హైకోర్టు తరలించాలని వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రభుత్వం నిర్ణ‌యం తీసుకుంది. దీనిపై వివాదం చెల‌రేగుతున్నా కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం మ‌ద్ద‌తు ఇచ్చింది. ప‌లు సంద‌ర్భాల్లో ఏపీలో మూడు రాజ‌ధానుల‌పై త‌న వైఖ‌రిని స్ప‌ష్టం చేసిన కేంద్రం ప్ర‌భుత్వం.. రాజధాని అంశం మా పరిధిలో లేదంటూ తేల్చేసింది.

బీజేపీ నేత‌ల‌కు షాక్‌… జ‌గ‌న్‌కు గుడ్ న్యూస్

మూడు రాజ‌ధానుల ఏర్పాటుకు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకోగా…వైసీపీయేతర పార్టీల‌న్నీ రాజధాని మార్పును వ్యతిరేకిస్తున్నాయి. ఏపీ స‌ర్కారు నిర్ణ‌యం శాసనమండలి గండం దాటి గవర్నర్‌ సంతకం కూడా పొంది గెజిట్‌లో వెలువడింది కూడా. అయితే హైకోర్టు ధర్మాసనం వ‌ద్ద‌కు చేరింది. వైఎస్ జ‌గ‌న్ స‌ర్కారు నిర్ణ‌యంపై దాదాపు 80 పిటిషన్లు దాఖలైనా అన్నిటికీ కలిపి ఒకే కౌంటర్‌ను రాష్ట్రం సమర్పించింది. త‌ద్వారా ఎన్ని విమ‌ర్శ‌లు ఎదు‌రైనా మూడు రాజ‌ధానుల‌పై వెన‌క్కి త‌గ్గ‌డం లేదని ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం క్లారిటీ ఇచ్చింది. ఇదే స‌మ‌యంలో కేంద్రం జోక్యం చేసుకుంది. కేంద్రం రాష్ట్ర నిర్ణ‌యానికి ఓకే చెప్పేసింది. ప‌లు ద‌ఫాలుగా త‌మ వైఖ‌రి తేల్చిచెప్పింది. రాజ‌ధాని అమ‌రావ‌తిలోనే ఉంటుంది. భ‌య‌ప‌డాల్సింది లేదు అని కొంద‌రు బీజేపీ నేత‌లు స్టేట్‌మెంట్లు ఇస్తున్న‌‌ప్ప‌టికీ కేంద్రం మాత్రం ఇప్ప‌టికే అనేక ద‌ఫాలుగా క్లారిటీ ఇచ్చింది. సీఆర్డీఏ చట్టం రద్దు, పరిపాలన వికేంద్రీకరణ బిల్లులపై హైకోర్టులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసి రాజధాని అంశం తమ పరిధిలోకి రాదని స్ప‌ష్టం చేసింది… ఏపీ రాజ‌ధాని అంశంలో జోక్యం చేసుకోబో‌మ‌ని తేల్చిచెప్పింది.

షాక్ త‌గిలిందిగా?

అయితే, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్ ఢిల్లీ టూర్‌పై వైసీపీ నేత‌లు, ఏపీ ప్ర‌భుత్వ పెద్ద‌లు క్లారిటీ ఇచ్చారు. ప్రధానితో స‌మావేశంలో ప్రధానంగా రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చిస్తారని స‌మాచారం. ముఖ్యంగా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పోలవరం, మండలి రద్దు, జీఎస్టీ బకాయిలు తదితర అంశాలను ఖ‌చ్చితంగా ప్ర‌స్తావిస్తార‌ని వివ‌రిస్తున్నారు. వైసీపీకి కేంద్ర కేబినెట్‌లో ఛాన్స్ ఇచ్చారనే ప్రచారం జోరుగా సాగుతోంది, ఎన్డీఏ జగన్ పార్టీకి మంత్రి పదవుల్ని ఆఫర్ చేసిందని స‌ద‌రు అంచనాలు వేసుకుంటున్న వారికి షాక్ త‌గ‌ల‌డం ఖాయ‌మ‌‌ని అంచ‌నా వేస్తున్నారు.


Share
sridhar

Recent Posts

Acharya: సీనియర్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చిరంజీవి “ఆచార్య” పై వైరల్ కామెంట్స్..!!

Acharya: కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi).. రామ్ చరణ్(Ram Charan) ఫస్ట్ టైం లాంగ్ లెన్త్ రోల్…

9 mins ago

Rana: ఆ బాలీవుడ్ స్టార్ హీరో సినిమా నుండి బయటకొచ్చేసిన రానా..??

Rana: దగ్గుబాటి రానా(Rana) హీరోగా మాత్రమే కాదు అన్ని రకాల పాత్రలు చేస్తూ తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం…

19 mins ago

Prabhas: ప్ర‌భాస్ ఆ డైరెక్ట‌ర్ కు హ్యాండ్ ఇవ్వ‌డం ఖాయ‌మేనా?

Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా స‌త్తా చాటుతున్న టాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ ప్ర‌భాస్ వ‌రుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…

55 mins ago

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బీజేపీ నుండి దూరం అవుతున్నట్లే(నా)..! ఈ ప్రసంగంలో భావం అలానే ఉందిగా..!?

Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…

1 hour ago

Shriya Saran: ఎంత భ‌ర్తైతే మాత్రం రోడ్డుపై అత‌డితో అంత రెచ్చిపోవాలా శ్రియా..?

  Shriya Saran: అందాల భామ శ్రియ‌ సరన్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…

2 hours ago

CM YS Jagan: కుమార్తె హర్ష ప్రతిభకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్

CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…

2 hours ago