NewsOrbit
ట్రెండింగ్ న్యూస్

షాకింగ్… పోలీస్ అధికారిని చంపిన పందెం కోడి

చాలా మందికి పెంపుడు జంతువులంటే చాలా ఇష్టం. ఎంతో ప్రేమతో వాటిని పెంచుతారు. దాని ఆనందంలోనే తమ సంతోషాన్ని చూసుకుంటారు. కాని కొన్ని సార్లు అవి చేసే అతి చిన్న పొరపాట్లే మనుషుల ప్రాణాల మీదికి వస్తాయి. అలాగే ఓ కోడి ఒక అధికారి ప్రాణం తీసింది. సంక్రాంతి వచ్చిందంటే చాలు గోదావరి జిల్లాల్లో కోడి పందేలు బలే జరుగుతుంటాయి. ఎంతో మంది పెందెం కోసం కోడిపుంజులను బరిలోకి దించుతారు. ఎంతో పట్టుదలగా వాటికి పందెంలో గెలవాడానికి ఆ కోడి పుంజును సిద్ధం చేస్తారు. గెలుస్తుందో.. ఓడుతుందో అది అనవసర విషయం కాని.. అందులో పాల్గొని గెలిస్తే మాత్రం కోడి ఓనర్ ఆనందం అంతా ఇంతా కాదు..

అందుకే కదా.. వాటిని ఆడొద్దని అధికారులు ఎంత మొత్తుకున్నా.. ఆ పందాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. లక్షలకు లక్షలు డబ్బులు పెట్టి మరీ ఆడుతుంటారు. ఈ ఆటను చట్టవిరుద్దంగా ఆడుతున్నారని వెళ్లిన ఓ పోలీసు అధికారి ప్రాణం తీసింది ఓ పందెం కోడి.. అదెలాగంటారా? ఇది చదివేయండి మరి.. ఈ కోడిపందేలు మన దేశంలోనే కాదు, ఫిలిప్పీన్స్ దేశంలోనూ జోరుగా నడుస్తాయి. అయితే ఆ కోడి పుంజు కత్తికి ప్రాణం వదిలాడో పోలీసు అధికారి.

అయితే కోడి పందేలను అడ్డుకోవడం అధికారులు చేసే సాధారణ విషయమే.. కాని కరోనా కల్లోలం కారణంగా ఫిలిప్పీన్స్ లో కోడిపందేలపై నిషేదం విధించారు. కాని అవేమీ లెక్కచేయకుండా ఉత్తర సమర్ ప్రాతంలో కోడిపందేలు నిర్వహించారు. దాంతో అక్కడి పోలీస్ అధికారులు సమాచారం అందుకుని స్థానిక శాన్ జోస్ మున్సిపల్ పోలీస్ స్టేషన్ లో ఆఫీసర్ ఇన్ ఛార్జిగా పనిచేస్తున్న క్రిస్టియన్ బోలోక్ తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. కోడి పందేలు నిర్వహించారన్న ఆధారంగా ముగ్గురుని అరెస్ట్ చేశారు. వారితో పాటుగా రెండు కోడి పుంజులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

అయితే పోలీసు అధికారి బోలోక్ ఆ పుంజులలో ఒకదానిని చేతుల్లోకి తీసుకోవడాని ప్రయత్నించాడు. అయితే దాని కాలికి కట్టిన పదునైన కత్తిని ఆ అధికారి పరిశీలించకపోవడంతో ఆ కత్తి నేరుగా పోలీసు అధికారి ఎడమ తొడభాగంలోని రక్తనాళాన్ని ఒక్కపెట్టున కోసేసింది. ఇంకేముంది తీవ్ర రక్త స్రావం జరిగింది. దాంతో ఆ పోలీసు అధికారి ప్రాణాలను విడిచారు. ఈ అనుకోని ఘటన అటు కుటుంబం, పోలీసు వ్యవస్థ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. చట్ట విరుద్దంగా జరుగుతున్న కోడి పందేలను ఆపాలని చేసిన ప్రయత్నంలో కోడి పుంజు చేతిలోనే తన ప్రాణాలను పోగొట్టుకున్నారు.

Related posts

TDP: 4 లోక్ సభ, 9 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ .. కోరుకున్న స్థానాన్ని దక్కించుకున్న గంటా

sharma somaraju

Tamannaah: త‌మ‌న్నాకు మ‌రో పేరు ఉందా.. ఫ్యాన్స్ కు కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది..!!

kavya N

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju