NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

క‌రోనా వ్యాక్సిన్‌… ఓ దిమ్మ‌తిరిగిపోయే వార్త‌

ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇప్పుడు అంద‌రి చూపు, క‌రోనా వ్యాక్సిన్ పైనే. ఈ మహ‌‌మ్మారి ఉగ్ర‌రూపం ఎప్పుడు త‌గ్గుతుందో అని ఓ వైపు చ‌ర్చించుకుంటూనే మ‌రోవైపు ఈ వ్యాధికి ప‌రిష్కారం కోసం జ‌రుగుతున్న‌ ప్ర‌య‌త్నాల‌పై ఆశ‌గా ఉన్నారు.

ఇలాంటి స‌మ‌యంలోనే ఓ షాకింగ్ వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. ముఖ్యంగా మ‌న‌దేశంలోనే అస‌లు స‌మ‌స్య‌.

అస‌లు షాక్ ఇదే…

క‌రోనా వైర‌స్ త‌న ప‌రివ‌ర్త‌నాన్ని మార్చుకుంటుండ‌టం అస‌లు షాక్‌. ప్రారంభంలో జలుబు, శ్వాససంబంధ సమస్యలు, తలనొప్పి వంటివి కరోనా లక్షణాలుగా అనుమానించారు. ఇప్పుడు రుచి కోల్పోవడం, వాసన గుర్తించకపోవడం వంటి లక్షణాలు అధికంగా కనిపిస్తున్నాయి. నాలుగైదు నెలలకిందట కరోనా సోకితే లక్షణాలు కనిపించేవి. ప్రస్తుతం 80 శాతం మంది బాధితుల్లో (అసిమ్టమాటిక్‌) లక్షణాలు కనిపించడం లేదు. కాబట్టి కరోనా నిర్మాణంలో మార్పులు జరిగే కొద్దీ కొత్త లక్షణాలు బయట పడుతుంటాయని నిపుణులు చెప్తున్నారు.

మ‌న‌కు ఎందుకు ప‌నిచేయ‌దో తెలుసా?
మ‌న దేశంలో ఇప్పటివరకు 2,321 వైరస్‌ల జన్యుక్రమాలను విశ్లేషించగా 3,427 ఉత్పరివర్తనాలు బయటపడ్డాయి. అత్యధికంగా ఏ2ఏ రకం వైరస్‌ విస్తరిస్తున్నదని తేలింది. ఇప్పటివరకు విశ్లేషించిన జీనోమ్‌లలో 68 శాతం ఏ2ఏ రకం, 20 శాతం వరకు ఐ/ఏ3ఐ రకం వైరస్‌గా గుర్తించారు. వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు ఏదో ఒక రకం వైరస్‌ను ఎంచుకొని, దానిని నిర్వీర్యంచేసి టీకా అభివృద్ధిచేస్తాయి. ఆ తర్వాత ఉత్పరివర్తనాలు పొంది కొత్త రూపంలోకి మారిన వైరస్‌ను కూడా ఆ టీకా అడ్డుకుంటుందా? అంటే.. కాలమే నిర్ణయిస్తుందని నిపుణులు చెప్తున్నారు.

మ‌న హైదరాబాద్ ప‌రిశోధ‌న‌ల్లో ఏం తేలింద‌య్యా అంటే…
హైదరాబాద్‌లోని సీసీఎంబీ సహా దేశవ్యాప్తంగా 20 రాష్ర్టాల్లోని 35 ల్యాబ్‌లు వైరస్‌ నిర్మాణంపై పరిశోధనలు చేస్తున్నాయి. తెలంగాణకు సంబంధించి సీసీఎంబీ శాస్త్రవేత్తలు 330 నమూనాల్లోని జీనోమ్‌లను విశ్లేషించారు. 72 శాతం (238) మందికి ఏ2ఏ రకం వైరస్‌, 25 శాతం మందికి ఏ3ఐ రకం వైరస్‌ సోకినట్టు నిర్ధారించారు. ఇలా వైరస్‌ నిర్మాణంలో మార్పులు కలుగుతున్నకొద్దీ వ్యాధి లక్షణాల్లో మార్పులు కనిపిస్తున్నాయి.

ఇదో గుడ్ న్యూస్ బాస్‌..
వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు ఏదో ఒక రకం వైరస్‌ను ఎంచుకొని, దానిని నిర్వీర్యంచేసి టీకా అభివృద్ధి చేస్తాయి. ఆ తర్వాత ఉత్పరివర్తనాలు పొంది కొత్త రూపంలోకి మారిన వైరస్‌ను కూడా ఆ టీకా అడ్డుకుంటుందా? అంటే.. కాలమే నిర్ణయిస్తుందని నిపుణులు చెప్తున్నారు. వ్యాక్సిన్‌ వేసుకున్న ఒకటి రెండు సంవ‌త్స‌రాల‌ తర్వాత గానీ పూర్తి అంచనాకు రాలేమని పేర్కొన్నారు. గత అనుభవాలను పరిశీలిస్తే వైరస్‌లో వచ్చే మార్పులను వ్యాక్సిన్‌ సమర్థంగా అడ్డుకోలేకపోయినా.. వ్యాధి ప్రభావాన్ని మాత్రం గణనీయంగా తగ్గిస్తుందని నిపుణులు చెప్తున్నారు. క‌రోనా వైర‌స్ విష‌యంలో ఏం జ‌ర‌గ‌నుందో వేచి చూడాల్సిందే.

author avatar
sridhar

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!