NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

హైద‌రాబాద్ న‌గ‌రానికి ఏమైంది …. ఎంత‌మందికి దిమ్మ‌తిరిగిపోయిందో తెలుసా?

jokes in twitter on hyderabad rains

హైద‌రాబాద్ .. తెలుగు వారికి పరిచ‌యం చేయ‌న‌క్క‌ర్లేదు. దేశంలోని ఐదు మెట్రో న‌గ‌రాల్లో మ‌న తెలుగువారికి గుర్తింపు ఇచ్చింది ఈ న‌గ‌రం . కానీ ఈ న‌గ‌రం ఇప్పుడు ఇంకో షాకింగ్ వార్త‌తో దేశంలో వార్త‌ల్లో నిలుస్తోంది. ఎప్ప‌ట్లాగే…హైదరాబాద్‌ పోలింగ్‌ శాతం దారుణంగా పడిపోయింది.

jokes in twitter on hyderabad rains

 

గ్రేటర్‌ వాసుల్లో ఈసారి కూడా నిర్లక్ష్యం రిపీటైంది. గత ఎన్నికలతో పోల్చితే మరి దారుణంగా ఉంది. 2010లో 42 శాతం.. 2016లో 45 శాతం పోలింగ్‌ నమోదైతే ఈసారి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు 35.8 శాతం పోలింగ్ న‌మోదైంది. మొత్తం మీద 40 శాతంలోపే పోలింగ్ న‌మోద‌యింది.

హైద‌రాబాద్ ప‌రువు తీసేశారు…

గ్రేటర్‌ ఎన్నికల్లో నగర పౌరులు ఓటు వేసిన తీరు చ‌ర్చ‌కు దారి తీస్తోంది. మంగ‌ళ‌వారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటలకు ముగిసింది. ఉదయం సమయంలో ఎక్కువగా నమోదైన పోలింగ్.. మధ్యాహ్నం భారీగా తగ్గిపోయింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 14 డివిజన్లలో కేవలం 5 శాతం మాత్రమే ఓట్లు నమోదయ్యాయి. ఐటీ కారిడార్‌లో అయితే పరిస్థితి మరీ దారుణంగా మారింది.

 

ఇదే కార‌ణ‌మ‌(ట‌)

ఇదిలాఉండ‌గా, పోలింగ్ త‌గ్గ‌డంపై ప‌లు ర‌కాల విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. గ్రేటర్‌ పోలింగ్‌ తగ్గుదలపై అనేక అంశాలు ప్రభావం చూపించినట్లుగా పేర్కొంటున్నారు. వరుస సెలవులు రావడం. ప్రభుత్వం సెలవు ప్రకటించినా పలు ప్రైవేట్‌ సంస్థలు ఉద్యోగులకు లీవ్‌ ఇవ్వకుండా ఉండటం. వర్క్‌ఫ్రం హోంతో ఇప్పటికీ హైదరాబాద్‌ చేరుకోని ఐటీ ఉద్యోగులు. మ‌రోవైపు కరోనా ప్రభావం గ్రేటర్‌ పోలింగ్‌పై స్పష్టంగా కనిపించిందని పలువురు అభిప్రాయపడ్డారు. గుర్తుల తారుమారు వల్ల ఒక్క ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్‌లో మాత్రమే రీ పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3న రీపోలింగ్ నిర్వహిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. గ్రేటర్‌ పరిధిలోని 149 డివిజన్లలో పోలింగ్‌ ముగియగా ఈనెల 4న ఓట్లు లెక్కించనున్నారు.

author avatar
sridhar

Related posts

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju