NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

తెలంగాణ మాఫియాడాన్ … ఖ‌తం అయిపోయిన త‌ర్వాత కూడా ఏం జ‌రుగుతోందంటే….

కాలంతో సంబంధం లేకుండా వార్త‌ల్లో నిలిచే అంశాలు కొన్ని ఉంటాయి. తెలంగాణలో సంచలనం రేపిన గ్యాంగ్‌స్టర్‌ నయీం ఉదంతం ఇలాంటిదే. 2016 ఆగస్టు 8వ తేదీన షాద్‌నగర్‌ దగ్గరల్లో నయీం ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన సంగతి తెలిసిందే.

నయీంతో ఎంతోమంది రాజకీయ నేతలకు, ప్రజాప్రతినిధులకు సంబంధాలు ఉన్నాయని అప్ప‌ట్లో పెద్ద ప్రచారమే జరిగింది. ల్యాండ్‌ సెటిల్‌మెంట్, బెదిరింపుల్లో పోలీసు అధికారుల ప్రమేయం కూడా ఉందని వార్తలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలకు సంబంధించిన ఎలాంటి సాక్ష్యాధారాలు లభించలేదని క్లీన్ చీట్ ఇచ్చేశారు. ఈ ఉదంతంలో మ‌రో ట్విస్టు తెర‌మీద‌కు వ‌చ్చింది.

న‌యీంను లేపేసిన‌పుడు ఏం జ‌రిగిందంటే…

తెలంగాణ‌లోని మాఫియా డాన్ల‌లో ఒక‌రైన నయీం ఎన్ కౌంట‌ర్ జ‌రిగిన కొన్ని ఏళ్ల త‌ర్వాత తిరిగి ఆయ‌న కేసు తెర‌మీద‌కు వ‌చ్చింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తాజాగా నయీం కేసులో మరోసారి సంచలన విషయాలు బయటపెట్టింది. నయీం ఎన్‌కౌంటర్ తర్వాత నయీం ఇంట్లో 24 ఆయుధాలని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు కానీ, ఆ ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయి అనే విషయాన్ని మాత్రం చెప్పలేదని ఫోరం ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్ పేర్కొంది. న‌యీం ఇంట్లో ఏం దొరికాయో వివ‌రంగా పేర్కొని ఈ కేసులో పూర్తిస్థాయిలో విచారణ జరపించాల్సిందిగా రాష్ట్ర గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు.

ఇన్ని మార‌ణాయుధాలు దొరికాయి…

న‌యీంను ఎన్‌కౌంట‌ర్ చేసిన‌పుడు పోలీసులు పెద్ద ఎత్తున ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. 3 ఏకే-47, 3 రివాల్వర్, తొమ్మిది పిస్తోలు, 7 టపంచాలు, ఒక స్టెన్ గన్‌, రెండు గ్రనేడ్స్‌, 5 కిలోల అమ్మోనియం నైట్రేట్, 6 మ్యాగజైన్ , 612 లైవ్ బుల్లెట్ , రెండు కోట్ల 16 లక్షల రూపాయల నగదు, 2 కిలోల బంగారం, రెండున్నర కిలోల వెండి, 21 కార్లు, 26 మోటార్స్ బైక్స్, 602 సెల్‌ఫోన్లు, 752 భూముల పత్రాలు, ఒక్క బుల్లెట్ జాకెట్, 130 డైరీలను స్వాధీనం చేసుకున్నారని ఫోరం పేర్కొంది. అయితే, వాటికి సంబంధించిన వివరాలు మాత్రం ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఈ కేసులో పూర్తి వివరాలు అధికారులు వెల్లడించడం లేదని గవర్నర్‌కు ఫిర్యాదు చేసిని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు.. ఈ కేసులో సమగ్ర దర్యాప్తు చేయాలంటూ గవర్నర్‌కు వినతిపత్రం అందజేశారు. దీంతో మ‌ళ్లీ ఈ కేసు తెర‌మీద‌కు రానుందా? గ్యాంగ్‌స్ట‌ర్ న‌యీం ఉదంతం ఎలాంటి మ‌లుపు తిర‌గ‌నుంది? అనే చ‌ర్చ జ‌రుగుతోంది.

author avatar
sridhar

Related posts

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju