NewsOrbit
న్యూస్

జూనియర్ ఎన్టీఆర్ సరికొత్త పార్టీ !చంద్రబాబు గుండెల్లో రైళ్లు!!

తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి సొంత పార్టీ పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. సరే అది ఆ రాష్ట్రం వార్త అనుకుంటే ఆంధ్ర ప్రదేశ్ లో కూడా జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీ స్థాపన ఏర్పాట్లలో ఉన్నాడని ఒక వార్త బాంబులా పేలింది.

shocking news to chandra babu junior ntr new party
shocking news to chandra babu junior ntr new party

పైగా ఈ సమాచారం ఇచ్చిన వ్యక్తి వైసీపీ మంత్రి కావడంతో పాటు జూనియర్ ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడు కావడంతో రాజకీయ వర్గాల్లో ఇదే ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది.త్వరలో  జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని, కాకపోతే ఇప్పుడు దానికి సరైన సమయం కాదని, ఆయనకు వయసు కూడా  చిన్నదని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని మీడియా చిట్ చాట్ లో వ్యాఖ్యానించారు. కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ హీరోగా సినిమాలు కూడా తీసిన విషయం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం ఆయన వైసీపీలో మంత్రిగా ఉన్నప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయట.

కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం గురించి చెప్పాక దాన్ని నమ్మాల్సిన పరిస్థితి ఉంటుందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.ఇంతకీ కొడాలి నాని ఏం చెప్పారంటే …జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ అవుతారా లేక సొంత పార్టీ పెడతారా అన్న విషయం ఇప్పుడే తాను చెప్పలేనని ,కానీ ముందు ముందు కూడా  టిడిపి చంద్రబాబు కుటుంబ సభ్యుల చేతుల్లోనే ఉంటే, తప్పనిసరిగా జూనియరు ఎన్టీఆర్ సొంతంగా పార్టీ పెట్టి ప్రజల ముందుకు వస్తారని  ఆయన క్లారిటీ ఇచ్చారు.చంద్రబాబు తనయుడు, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేషు ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలంటే తప్పనిసరిగా జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వంలో ఎన్నికలకు వెళితేనే  అది సాధ్యం అవుతుందని మంత్రి పనిలో పనిగా సెటైర్ కూడా విసిరారు..అలాకాక చంద్రబాబు తనయుడుగా, టిడిపి భవిష్యత్తు నాయకుడిగా ఎన్నికలకు వెళితే లోకేషు ను సొంత పార్టీ  నాయకులే తుక్కుతుక్కుగా ఓడిస్తారు అంటూ ఎద్దేవా చేశారు.

కాకపోతే జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా, చాలా కష్టపడాలని, ప్రజాబలం పెంచుకోవాలని సూచించారు. జూనియర్ ఎన్టీఆర్ సొంత పార్టీ పెట్టినా తాను మాత్రం వైసిపి లోనే ఉంటానని జగన్ వెంట నడుస్తానని కొడాలి నాని క్లారిటీ ఇచ్చారు.జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం, సొంత పార్టీ ఏర్పాటు వార్తలు వినాక తెలుగుదేశం పార్టీ నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ ల మనసు మనసులో లేదని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. తన రాజకీయ ఎదుగుదలకు జూనియర్ ఎన్టీఆర్ ఏనాటికైనా అడ్డమని లోకేష్ కు బాగా తెలుసని, కుమారుడి సమర్ధత గురించి కరెక్టు అంచనా ఉన్న చంద్రబాబు కూడా జూనియర్ ఎన్టీఆర్ ను చూసి బెదిరి పోతారని టిడిపి వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.ఆ ఇద్దరూ కలిసి జూనియర్ ఎన్టీఆర్ కు ఏ విధంగా చెక్ పెడతారు అన్నదే ఇప్పుడు టిడిపి వర్గాల్లో రహస్య చర్చనీయాంశం!

author avatar
Yandamuri

Related posts

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju

TDP: ఉదయగిరి వైసీపీకి బిగ్ షాక్ .. కీలక నేత రాజీనామా.. టీడీపీలో చేరిక

sharma somaraju

EC: ఏపీలో మరో ఇద్దరు సీనియర్ ఐపీఎస్‌లపై బదిలీ వేటు

sharma somaraju

AP High Court: శిరో ముండనం కేసు .. వైసీపీ ఎమ్మెల్సీ త్రిమూర్తులుకు హైకోర్టులో లభించని ఊరట .. విచారణ వాయిదా

sharma somaraju

Pawan Kalyan: పవన్ కల్యాణ్ అయిదేళ్ల సంపాదన..ఆస్తులు..అప్పులు ఎంతంటే..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Sreeleela: తండ్రి వ‌య‌సున్న‌ హీరోతో రొమాన్స్‌కు రెడీ అవుతున్న శ్రీ‌లీల‌.. మ‌తిగానీ పోయిందా?

kavya N

Ram Charan: ఒక్కసారిగా 30 పెంచేశాడా.. బుచ్చిబాబు సినిమాకు రామ్ చరణ్ రెమ్యున‌రేషన్ ఎంతో తెలుసా?

kavya N

Pawan Kalyan: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు కాబోతుంది – పవన్ కళ్యాణ్ ..అట్టహాసంగా నామినేషన్ దాఖలు

sharma somaraju

AP Elections: ఎమ్మెల్యే టికెట్ వద్దు .. ఎంపీ టికెట్ ‌యే ముద్దు

sharma somaraju

Darling: ప్ర‌భాస్ డార్లింగ్ మూవీకి 14 ఏళ్ళు.. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ ని రిజెక్ట్ చేసిన అన్ ల‌క్కీ హీరో ఎవ‌రు?

kavya N

Prabhas: మ‌రోసారి గొప్ప మ‌న‌సు చాటుకున్న ప్ర‌భాస్‌.. టాలీవుడ్ డైరెక్ట‌ర్స్ కోసం భారీ విరాళం!

kavya N

Aparna Das: చిన్న వ‌య‌సులోనే పెళ్లి పీట‌లెక్కేస్తున్న బీస్ట్ బ్యూటీ.. వ‌రుడు కూడా న‌టుడే!!

kavya N

ప‌య్యావుల క్లాస్ ప్ర‌చారం.. రెడ్డి మాస్ ప్ర‌చారం… ఉర‌వ‌కొండ విన్న‌ర్ ఎవ‌రంటే..!