Shocking: షాకింగ్.. ఆ ఊరిలో ఒకరు చనిపోతే.. వాళ్లతో పాటు ఇంకొకరు చనిపోతారు..!

Share

Shocking: ఈ ప్రపంచంలో మనల్ని అబ్బురపరిచే.. భయపెట్టే.. ఆశ్చర్యపరిచే వింతలు, విశేషాలు ఎన్నో దాగున్నాయి. కొన్ని వింతలు తెలుసుకుంటే ఎవరైనా సరే షాక్ అవ్వాల్సిందే. తాజాగా అలాంటి వింతే ఇప్పుడు వెలుగులోకి వచ్చి అందర్నీ విస్తుపోయేలా చేస్తోంది. ఓ గ్రామంలో ఒకరు చనిపోతే చాలు.. మిగతా వారందరూ ప్రాణభయంతో హడలి పోతారట. ఇందుకు కారణం ఆ గ్రామంలో ఒకరు మరణించిన కొద్దిరోజుల్లోనే మరొకరు మరణిస్తారట. ఈ విధంగా అక్కడ శతాబ్దాలుగా జరుగుతోందట. మరి అలా ఎందుకు జరుగుతుందనే విషయం ఎవరికీ అంతుపట్టడం లేదు. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడో లేదు. తెలంగాణ రాష్ట్రం మంచిర్యాల జిల్లాలోనే ఉంది. ఆ గ్రామం పేరు నెన్నెల… ఈ ఊరి ప్రజలు తెల్లారితే చాలు.. ఎవరికి చావు మూడిందా అనే భయంతో బిక్కుబిక్కుమంటూ సమయాన్ని గడుపుతుంటారు.

BREAKING: ఇవాళ సాయంత్రం ఒకే స్టేజి మీద ఆమిర్‌ఖాన్‌, చిరంజీవి..!

ఈ ఊరి ప్రజలు ఇప్పటికే గ్రహశాంతులు జరిపించారు. అలాగే బలి కూడా ఇచ్చారు. వాస్తుపరమైన దోషాలను తొలగించేందుకు నిపుణులను సైతం ఆశ్రయించారు. వేద పండితులతో శాంతి పూజలూ చేయించారు. కానీ వరుస మరణాలు మాత్రం ఆగడం లేదు. ఈ గ్రామానికి ఐదు శతాబ్దాల చరిత్ర ఉందని చెబుతుంటారు. గ్రామంలో ఒకరు చనిపోతే వాళ్లతో పాటు ఇంకొకరు చనిపోవడం శతాబ్దాల నుంచి అనాధిగా వస్తోంది. తర్వాత వచ్చేది ఎవరి వంతు అనే భయంతోనే చాలామంది సగం ప్రాణాలు వదిలేస్తున్నారు. మృత్యుభయంతో చనిపోయే వారి సంఖ్య నాలుగుకు చేరుకుందంటే అక్కడి ప్రజల్లో భయం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. చనిపోయే వారిలో ఎక్కువ మంది గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులే ఉండటం గమనార్హం.

White Heads: వైట్ హెడ్స్ కి ఈ సింపుల్ చిట్కా తో చెక్ పెట్టండి..!!
మొదట్లో ఇది ప్రజల్లో ఉన్న ఒక మూఢనమ్మకమేనని అందరూ కొట్టిపారిసేవారు. కానీ ప్రతిసారి ఇలానే జరుగుతుండడం.. దానికి సాక్ష్యాలు, ఆధారాలు ఉండడంతో హేతువాదులు కూడా ధైర్యం చెప్పే ప్రయత్నం చేయలేకపోతున్నారు. అయితే చనిపోయిన వారి అంత్యక్రియలను గ్రామంలోని పడమర దిక్కున చేస్తున్నారని.. అలాకాకుండా తూర్పు దిక్కున అంత్యక్రియలు నిర్వహిస్తే జంట చావులు ఆగుతాయని కొందరు విశ్వసిస్తున్నారు. ఇక ఈ గ్రామ పంచాయతీ డెత్ సర్టిఫికేషన్ బుక్ లో అన్ని పేజీలోనూ జంట మరణాలే కనిపిస్తుంటాయి. కొన్ని వరుస మరణాలు వారాల వ్యవధిలో సంభవిస్తే మరికొన్ని గంటల వ్యవధిలోనే సంభవిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో 24 గంటల్లోనే ఒకరి తర్వాత మరొకరు చనిపోతూ వస్తున్నారు. దాంతో ఆ గ్రామ ప్రజల్లో మృత్యుభయం మరింత పెరిగిపోతోంది.

Breaking : వై ఎస్ జగన్ కి బహుమతి గా బాలాపూర్ లడ్డూ – 18.90 లక్షలకి కొని జగన్ కి ఇస్తున్నాడు


Share

Related posts

Big Boss 5 Telugu: ఆ కంటెస్టెంట్ గ్యారెంటీ టాప్ ఫైవ్ లో అంటున్న తనిష్..!!

sekhar

అఖిల ప్రియ కీలక నిర్ణయం… ఎవరి ఎఫెక్టో… ఏమీ పేరో?

CMR

కుర్రవాడి ప్రాణం కాపాడింది!

Siva Prasad