NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బాబు ప‌రిస్థితి ఎంత ఘోరం… ఆఖ‌రికి బీజేపీ విష‌యంలో…

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేంద్రంగా, దేశ‌వ్యాప్తంగా మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల గురించి గ‌త కొద్దిరోజులుగా కొత్త చ‌ర్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే.

ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ఎన్డీఏలో చేరుతుంద‌ని, కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తు ఇస్తుంద‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే, దీన్ని వైసీపీ తిప్పికొడుతోంది. అయితే, ఇదే స‌మ‌యంలో బీజేపీ- వైసీపీ మ‌ధ్య ఉన్న స‌ఖ్య‌త మాత్రం ఎవ‌రూ కాద‌న‌లేని నిజం. అయితే, ఈ స‌మ‌యంలో అంద‌రి చూపు ఏపీ మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడుపై ప‌డింది.

ఇదే కొత్త చ‌ర్చ‌

ఏపీ ముఖ్య‌మం‌త్రి వైఎస్ జ‌గ‌న్ ఢిల్లీ టూర్ పుర‌స్క‌రించుకొని కొన్ని మీడియా సంస్థ‌ల్లో ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు వ‌చ్చాయి. పోలవరం,రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అని పేర్కొంటూ సాగుతున్న సీఎం జగన్ ఢిల్లీ పర్యటన అసలు రహస్యం మాత్రం ఎన్డీయే లో భాగస్వామ్యం అవ్వడమే అని ఓ పార్టీ అనుకూల మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది. ఈ కలయిక లో భాగంగా వైఎసార్సీపి కి కేంద్ర క్యాబినెట్ లో బెర్త్ దొరకనుంది.ఒక కేంద్ర మంత్రి పదవి, కేంద్ర సహాయ మంత్రి పదవి లభించనుంది. కేంద్ర మంత్రిగా విజయసాయి రెడ్డి కి అవకాశం దక్కనుందని కూడా జోస్యం చెప్పేశాయి.

వైసీపీ కొట్టి పారేసింది

అయితే, తాము ఎన్డీఏలో బాగ‌స్వామ్యం అవుతామ‌నే విష‌యం విప‌క్షాల ప్ర‌చార‌మే త‌ప్ప వాస్త‌వం కాద‌ని వైసీపీ తేల్చిచెప్పేసింది. ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గన్ మోహ‌న్ రెడ్డి న‌మ్మినబంటు, ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడ‌తూ తాము ఎన్డీయేలో చేర‌బోవ‌డం లేద‌ని ప్ర‌క‌టించారు. అంతేకాకుండా ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఢిల్లీ ప‌ర్య‌ట‌న రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసమేన‌ని తేల్చి చెప్పేశారు.

ఆ పెద్దాయ‌న బాబు గాలి తీసేశాడుగా

అయితే, ఈ ప‌రిణామాల‌పై సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ ఆస‌క్తిక‌ర విశ్లేష‌ణ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్‌ పార్టీ, బిజెపి ఒకరికి ఒకరు సహకరించకున్నా వారి వారి  సిద్ధాంతాలు వేరు. వారి ఓటు బ్యాంక్ వేర‌ని పేర్కొంటూ ఎన్నికలలో వారికి సఖ్యత కుదరదని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం, రాష్ట్రంలోని వైయస్సార్సీపి ప్రభుత్వం విధానాలను ఎండగట్టే విషయంలో టీడీపీ బంగారు అవకాశం కోల్పోయిందని విశ్లేషించారు. దేశంలో, రాష్ట్రంలో ఛాంపియన్‌ ఉండవలసిన టిడిపి ఆత్మహత్యా స‌దృశ్యానికి పాల్పడుతూ బీజేపీకి మద్దతు ఇస్తోందని కామెంట్‌ చేశారు. త‌ద్వారా టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు ప‌రిస్థితిని ఎద్దేవా చేశారు.

author avatar
sridhar

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju