NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

జగన్ అడ్డా లో జగన్ మీద ముసలం పుట్టింది ? కారణం ఇదే ? 

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ముఖ్య‌మంత్రి, వైఎస్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఇలాకా అయిన కడపలో సొంత పార్టీలోనే ముస‌లం పుట్టిందా?

త‌మ ఇలాకా అయిన క‌డ‌ప నుంచి రాజ‌కీయాల‌ను ప్రారంభించి స‌త్తా చాటుకున్న సీఎం జ‌గ‌న్ అక్క‌డ ఎదుర‌య్యే ప‌రిస్థితుల‌తో ఒకింత అప్ సెట్ అవుతున్నారా? తాజాగా సోష‌ల్ మీడియాలో ఈ చ‌ర్చ జ‌రుగుతోంది. ఇందుకు కార‌ణం, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.

అంత చేస్తే ఇదేనా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జగన్ మోహ‌న్ రెడ్డి సొంత జిల్లా అయిన వైఎస్ఆర్ కడప లో గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసేసింది. ఇలా గెలిచిన వారిలో జ‌మ్మ‌ల మ‌డుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఒక‌రు. అయితే, ఆయ‌న‌పై తాజాగా కొత్త ప్ర‌చారం జ‌రుగుతోంది. టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి అయిన రామసుబ్బారెడ్డిని వైసీపీలోకి తీసుకొని వ‌చ్చింది మొద‌లు సుధీర్ రెడ్డి హ‌ర్ట‌వుతున్నార‌ట‌. ఇప్పుడు ఇది పీక్స్ కు చేరిపోయింద‌ట‌. రామ‌సుబ్బారెడ్డి ఏకంగా ఓ ఆఫీసు తెరిచి వైసీపీ ముఖ్య నేత‌గా చెలామ‌ణి అవ‌డం త‌ట్టుకోలేక‌పోతున్నార‌ట జ‌మ్మ‌లమ‌డుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి.

మండిపోతోంద‌ట‌…

రామసుబ్బారెడ్డి పెత్త‌నం చెలాయించ‌డ‌మే ఇబ్బందిక‌రంగా ఉందనుకుంటున్న స‌మ‌యంలో వైసీపీ కోసం కష్టపడ్డ వారికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని నేతలు మండిపడుతున్నారట. పాత టీడీపీ వాళ్లకే క‌డ‌ప‌ జిల్లాలో.. నియోజకవర్గంలో పనులు కాంట్రాక్టులు దక్కుతున్నాయని సుధీర్ రెడ్డికి అనుచలు ఫిర్యాదు చేశార‌ట‌. దీంతో ఎవరైనా తన దగ్గర ముఖ్య‌మంత్రి వైఎస్ జగన్ మోహ‌న్ రెడ్డి గురించి ప్ర‌స్తావిస్తే, వైసీపీ పేరు ఎత్తితే కోపంతో చూస్తున్నారని ప్రచారం జరుగుతోంది. జగన్ గాలిలో అంత మెజార్టీ వస్తుందా? అంటూ ప్ర‌శ్నించార‌ని సోష‌ల్ మీడియాలో కొంద‌రు ప్ర‌చారం చేస్తున్నారు.

అబ్బే అవ‌న్నీ ఒత్తి మాటలే…

అయితే, తాజాగా జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ ప్ర‌చారంపై స్పందించారు. వైఎస్సార్‌ కడప జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయంగా తనపై వస్తున్న ఆరోపణలను ఖండించారు. ఇటీవల మీడియాలో తన పైన వచ్చినవ వార్తలన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లేకపోతే తనకు రాజకీయ భవిష్యత్తే లేదని, అసలు రాజకీయాల్లోకి వచ్చేవాడినే కాదని స్పష్టం చేశారు.

రాజీనామా చేసేస్తాను

సీఎం జగన్‌కు తాను ఎప్పుడూ విధేయుడిగా ఉంటానని, ఎప్పుడు రాజీనామా చేయమన్నా చేస్తానని సుధీర్ రెడ్డి ప్ర‌క‌టించారు.
తాను తొలినుంచీ వైఎస్సార్‌, జగన్‌ అభిమాని అని గుర్తుచేశారు. “నా మీద వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నాను. జమ్మలమడుగులో నా గెలుపున‌కు కారణం ఎంపీ అవినాష్ రెడ్డే. అలాంటి కుటుంబాన్ని నేనెందుకు విమ‌ర్శిస్తాను? తుదిశ్వాస వరకు వైఎస్ కుటుంబానికి కార్యకర్తగానే ఉంటాను. ఇకనైనా నాపై అసత్య ప్రచారాలు మానుకోండి’ అని అన్నారు. తాను కడప జిల్లాకు చెందిన వ్యక్తినని, తన భాష ఇలాగే ఉంటుందని సుధీర్ రెడ్డి తెలిపారు.

ర‌ఘురామ కృష్ణంరాజు ఎంట్రీ

నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుతో తనను పోల్చడం దారుణమని, ఆయన అలా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని సుధీర్ రెడ్డి అన్నారు. ‘నాపై అసత్య ప్రచారాలు వద్దు. వైఎస్ కుటుంబాన్ని ఎదిరించినోళ్లు ఇంతవరకు ఎవరూ బాగుపడలేదు. రఘురామ కృష్ణంరాజు, ఆదినారాయణ రెడ్డి లాంటోళ్లే ఇళ్లలో కూర్చొని వున్నారు.` అంటూ సుధీర్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

author avatar
sridhar

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju