NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

విజేత త‌ప్ప‌ట‌డుగు…. అగాథంలోకి అనిల్ అంబానీ

Share

అనిల్ అంబానీ. `కొద్దికాలం` కింద‌టి వ‌ర‌కు `కొంద‌రికి` ఆయ‌న స్ఫూర్తి. కానీ తండ్రి నుంచి వార‌స‌త్వంగా వ‌చ్చిన భారీ వ్యాపారాలు, ఆస్తుల‌ను సైతం నిల‌బెట్టుకోలేకుండా దివాళా తీసిన వ్యాపార‌వేత్త‌.

 

ప్రపంచంలోని టాప్‌ టెన్‌ ధనవంతుల్లో ఒకరైన ముకేష్‌ అంబానీకి స్వయానా సోదరుడైన అనిల్ అంబానీ.. దేశంలోని కార్పొరేట్‌ ప్రముఖుల్లో ఒకరు. అయితే, ఆయ‌న జీవితంలో మునుపు ఎన్న‌డూ ఊహించ‌ని ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

నా ద‌గ్గర ఇంకేం లేవు

రిలయన్స్ అనిల్ ధీరుభాయ్ అంబానీ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్ అంబానీకి చెందిన ఆర్‌కామ్‌కు ఇచ్చిన 925 మిలియన్‌ డాలర్ల రుణాన్ని రికవరీ చేసుకోడానికి పలు బ్యాంకులు లండన్‌లో కోర్టును ఆశ్రయించాయి. ఆయన ఆస్తులను బహిర్గతం చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించాయి. యూకే హైకోర్టు విచారణకు ఇండియా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైన ఆయన… ప్రస్తుత తన జీవన శైలి, ఆస్తులు, అప్పుల గురించి తెలియజేశారు. ఇప్పుడు సాధారణ జీవితం గడుపుతున్నాన‌ని, ఒక్క కారు మాత్రమే వాడుతున్నాన‌ని వెల్ల‌డించా. ఆఖరికి చట్టపరమైన ఖర్చుల కోసం ఇంట్లోని బంగారాన్ని కూడా అమ్మేశాన‌ని స్వయంగా ఆయనే చెప్పారు. మొత్తానికి బకాయిలు చెల్లించేందుకు తన దగ్గర ఇంకేం మిగల్లేదంటూ అంబానీ చేతులెత్తేశారు. కోర్టు ఖర్చుల కోసం నగలన్నీ అమ్మేయాల్సి వచ్చిందని బ్రిటన్‌ న్యాయస్థానం ధర్మాసనం ముందు అంబానీ వాపోయారు.

అంబానీకి మ‌రో షాక్‌

మ‌రోవైపు అనిల్ అంబానీ రుణ బకాయిలను తిరిగి సాధించుకునే పనిలో భాగంగా ఆస్తుల అమ్మకానికి ఆయా బ్యాంకులు సిద్ధ పడుతున్నాయి. ఆస్తుల అమ్మ‌కం కోసం బ్యాంక‌ర్స్ బిడ్స్ ఆహ్వానించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. దాదాపు 20వేల కోట్ల బ‌కాయిల‌ను రిక‌వ‌రీ చేసే ప‌నిలో బ్యాంకులు ఉన్న‌ట్లు ప‌లు మీడియా సంస్థ‌లు క‌థ‌నాలు వెలువ‌రించాయి. రుణ బకాయిలను తిరిగి పొందేందుకు భాగంగా ఆస్తుల అమ్మకానికి ఆయా బ్యాంకులు సిద్ధ పడుతున్నాయి. దీనికి సంబంధించి ఆసక్తి ఉన్న వర్గాల నుంచి బిడ్లను ఆహ్వానించినట్టు సమాచారం. ఆర్‌సిఎల్ రుణంలో 93 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న డిబెంచర్ హోల్డర్ల కమిటీ (కోడిహెచ్) శనివారం ఎక్స్‌ప్రెషన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ (ఇఒఐ) లను ఆహ్వానించడానికి పత్రాలను జారీ చేసింది. రిలయన్స్ గ్రూప్ కంపెనీలకు అతిపెద్ద రుణాలు ఇచ్చిన బ్యాంకులలో బ్యాంక్ ఆఫ్ బరోడా ఒకటి, కొన్ని నెలల క్రితం దివాలా కోడ్ సెక్షన్ 227 ప్రకారం రిలయన్స్ గ్రూప్ కంపెనీలపై చర్యలు తీసుకోవాలని ఆర్‌బి‌ఐని కోరింది, కాని ఆర్‌బి‌ఐ ఈ అభ్యర్థనను తిరస్కరించింది. ఈ ఆస్తుల అమ్మ‌కం వార్త‌ల‌పై రిల‌య‌న్స్ అధినేత అనిల్ అంబానీ అధికారికంగా స్పందించాల్సి ఉంది.


Share

Related posts

ఏపీ హై కోర్టు లో షాకింగ్ సీన్ ? : ప్రభుత్వ న్యాయవాది పిన్ డ్రాప్ సైలెన్స్ ? 

sridhar

పూజా హెగ్డే రాధేశ్యామ్ సెట్ నుంచి వెళ్లిపోవడంతో క్లారిటీకొచ్చేసిన ఫ్యాన్స్ …!

GRK

AP News Ministers List: ఏపి కేబినెట్ .. కొత్త మంత్రులు వీరే

somaraju sharma