NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బాబు, లోకేష్‌…ఇంత‌క‌న్నా అవ‌మానం ఏముంటుంది?

తెలుగుదేశం జాతీయ పార్టీ!. ఇలా టీడీపీ నేత‌లు ప్ర‌క‌టించుకుంటారే కానీ ఆ పార్టీకి జాతీయ హోదా అనేది ఎన్నిక‌ల క‌మిష‌న్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ద‌క్క‌లేదు.

 

అయిన‌ప్ప‌టికీ, `స్వ‌యం ప్ర‌క‌టిత‌` జాతీయ పార్టీకి అధ్య‌క్షుడిగా చంద్ర‌బాబు నాయుడు , ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ఆయ‌న త‌న‌యుడు నారా లోకేష్ ప‌దే ప‌దే చెప్పుకొంటుంటారు. క‌ట్ చేస్తే , ఈ స్వ‌యం ప్ర‌క‌టిత జాతీయ‌ పార్టీ అధ్య‌క్ష , ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌కు ఇప్పుడు ప‌రువు పోయే ప‌రిస్థితి ఎదురైంద‌ని అంటున్నారు.

బాబు, లోకేష్ ఎక్క‌డ‌?

తెలంగాణ‌లో ఇప్పుడంద‌రి చూపు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌లపైనే ఉన్న సంగ‌తి తెలిసిందే. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పూర్తిగా పట్టు కోల్పోయినప్ప‌టికీ, గ్రేటర్ ఎన్నికలతో తమ ఉనికి చాటాలని ప్రయత్నాలు చేస్తోంది. అందుకు తగ్గట్టే దాదాపు 95 స్థానాలు దాకా తమ అభ్యర్థులను బరిలోకి దించింది. ఈరోజు హ్యాపీ హైదరాబాద్ పేరుతో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో.. పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

మేనిఫెస్టోలో ఏముంది?

తెలుగుదేశం పార్టీ హయాంలోనే హైదరాబాద్‌ అభివృద్ధి చెందిందని జీహెచ్ఎంసీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేస్తూ… టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. మాటలకే పరిమితమైన టీఆర్‌ఎస్ పార్టీ కావాలో.. అభివృద్ధి చేసే తెలుగు దేశం పార్టీ కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని ఎల్‌.రమణ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే ప్రతి ఇంటికి మంచి నీటి సరఫరా చేయడంతోపాటు పేదలందరికీ ఉచిత నల్లా కనెక్షన్‌ అందిస్తామన్నారు. పూర్తిస్థాయిలో వైఫై నగరంగా చేయడానికి కృషి చేస్తామన్నారు. అలాగే ప్రతి ఇంటికి పైప్‌లైన్ల ద్వారా వంటగ్యాస్‌ సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు. పేదవారందరికీ పక్కా గృహాలు నిర్మిస్తామని.. మేనిఫెస్టోలో తెలిపారు.

 

ఇంత‌కంటే ప‌రువు త‌క్కువ ఏముంటుంది?

గ్రేట‌ర్ పోరులో తెలుగుదేశం పార్టీ ఇచ్చే పోటీ గురించి ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌నేది ప‌చ్చి నిజం. అయిన‌ప్ప‌టికీ త‌మ ఉనికి చాటుకోవ‌ల‌ని టీడీపీ ప్ర‌య‌త్నిస్తోంద‌న్నది కూడా నిజం. అందులో త‌ప్పేం లేదు కూడా. కానీ హైద‌రాబాద్‌లోనే ఉన్న తండ్రికొడుకులు కం `స్వ‌యం ప్ర‌క‌టిత‌` జాతీయ పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు , ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేష్ ఎందుకు ప్ర‌చారం ఊసెత్త‌డం లేదు? క‌నీసం అస‌లు గ్రేట‌ర్ పోరు గురించి కూడా ప‌ట్టించుకోవ‌డం లేదు అనేది అంద‌రికీ తెలిసిన ర‌హ‌స్య‌మే! పార్టీ ర‌థ‌సార‌థులే ప‌ట్టించుకోక‌పోతే… తెలుగుదేశం పార్టీ అభ్య‌ర్థులు , కార్య‌క‌ర్త‌ల‌కు ఇంత‌కంటే అవ‌మానం ఏం ఉంటుంద‌ని రాజ‌కీయ వ‌ర్గాలు చర్చించుకుంటున్నాయి.

author avatar
sridhar

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju