NewsOrbit
న్యూస్

Sreeja: సమంత శైలిని అనుకరించిన శ్రీజ!ఇది “అందుకు” సంకేతం అంటున్న సినీ జనాలు! అసలేం జరిగిందంటే?

Sreeja: భారీ వర్షం పడుతుందనడానికి ఉరుములూ మెరుపులూ సంకేతమైతే సెలబ్రిటీ కపుల్స్ విడిపోబోతున్నారు అనడానికి వారు ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో పేర్లు మార్చుకోవటమే సూచిక అనిపిస్తోంది.

Shreeja imitating Samantha's style!
Shreeja imitating Samanthas style

మెగాస్టార్ చిరంజీవి రెండో కూతురు శ్రీజ హఠాత్తుగా ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్ లోని తన ఖాతా లో భర్త కల్యాణ్ దేవ్ పేరు తీసేసి తండ్రి ఇంటి పేరైన కొణిదెల (అంటే శ్రీజ కొణిదెల)అని మార్చుకోవడం వల్ల ఇప్పుడీ ప్రస్తావన తేవాల్సి వస్తోంది.చాలాకాలంగా శ్రీజ, ఆమె రెండో భర్త కల్యాణ్ దేవ్ ల మధ్య దూరం పెరిగిపోయిందని వార్తలు వస్తున్న విషయం విదితమే.ఇప్పుడు శ్రీజ తన పేరు పక్కన సోషల్ మీడియా ఖాతాల్లో భర్తపేరు తీసేయడం తో వారు దాదాపు విడిపోవడానికి సిద్ధమైపోయారన్న అభిప్రాయం కలిగిస్తోంది.

సమంత చేసింది ఇదే!

ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగ చైతన్య సమంతలు కొంతకాలం పాటు మేడ్ ఫర్ ఈచ్ అదర్ జంట మాదిరి అందరినీ అలరించారు.చివరకు కోడల్ని చూసి మావయ్య అక్కినేని నాగార్జునే ముచ్చట పడిపోయే రీతిలో సమంత ప్రవర్తన ఉండేదట.లోలోన ఏమైందోగానీ సడన్ గా ఒక రోజు సమంత తన సోషల్ మీడియా ఖాతాల్లో నుండి తన పేరు చివర ఉండే అక్కినేని అనే పేరును తొలగించేసింది.వెనువెంటనే ఊహాగానాలు మొదలయ్యాయి. అవి చివరకు నిజమయ్యాయి. నాగచైతన్య సమంతలు అధికారికంగానే విడిపోయారు.

Sreeja: శ్రీజ కూడా అదే బాట అనుసరిస్తోందా!

ఇక చిరంజీవి ముద్దుల కూతురు శ్రీజ కూడా రెండు రోజుల క్రితం సమంత మాదిరే సోషల్ మీడియా ఖాతాల్లో నుంచి తన పేరు చివర ఉండే భర్త కల్యాణ్ దేవ్ పేరును తొలగించి తండ్రి ఇంటి పేరును పెట్టుకోవటం జరిగాక ఆ ఇద్దరి మధ్య పూర్తిగా చెడిందని, ఇవాళో రేపో విడాకులు తీసుకోబోతున్నారన్న ప్రచారం ఉద్ధృతమైంది.ఇంకా చెప్పాలంటే శ్రీజ,కల్యాణ్ దేవ్ లు దాదాపు సంవత్సర కాలంగా విడివిడిగానే ఉంటున్నారు.

చిరంజీవికి కూడా చిరాకు కలిగిందా?

శ్రీజ 2007 లో శిరీష్ భరద్వాజ్ ను ప్రేమించి ఆర్యసమాజ్ లో పెళ్లి చేసుకుంది.ఆ సందర్బంగా చిరంజీవి నుండి తామిద్దరికీ ప్రాణహాని ఉందని కూడా శ్రీజ మీడియా సమావేశాల్లో ఆరోపించి సంచలనం రేపింది.ఒక బిడ్డ కూడా పుట్టాక శ్రీజ భరద్వాజ్ లు 2011 లో విడిపోయారు.కన్న ప్రేమతో అంతటి మెగాస్టార్ కూడా శ్రీజనుఇంటికి ఇంటికి తీసుకొచ్చి నెత్తిన పెట్టుకున్నారు.2016 లో రెండో పెళ్లయినప్పటికీ శ్రీజ కల్యాణ్ దేవ్ ల వివాహం మెగా రేంజ్ లో ఆయన చేశారు.కల్యాణ్ దేవ్ నటించిన విజేత అనే సినిమాను చిరంజీవి ప్రమోట్ సైతం చేశారు.ఆ తర్వాత ఏమైందో గానీ శ్రీజ కల్యాణ్ దేవ్ లు వేరయ్యారు.ఈ మధ్యే కళ్యాణ్ దేవ్ ఇంకో సినిమాలో నటించినా దాన్ని మెగా కాంపౌండ్ అస్సలు పట్టించుకోకపోవడాన్ని బట్టి చిరంజీవి కి కూడా అతడిపై చిరాకు వచ్చినట్లు భావించాల్సి ఉంటుంది.ఈ సంకేతాలను బట్టి చూస్తే ఈరోజు రేపు శ్రీజ కల్యాణ్ దేవ్ ల సపరేషన్ కు సంబంధించి అధికారిక ప్రకటన రానున్నదని అర్థం చేసుకోవాలని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి

 

author avatar
Yandamuri

Related posts

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju