సాక్షి ఆఫీసు ముందు శ్రీరామ్ ధర్నా

90 views

అనంతపురం,డిసెంబర్ 29: మంత్రి పరిటాల సునీతపై సాక్షి దినపత్రికలో వచ్చిన ఒక కథనంపై ఆమె కుమారుడు పరిటాల శ్రీరాం నిరసన ప్రదర్శనకు దిగారు. అసత్య ఆరోపణలతో కథనం ప్రచురించారంటూ పరిటాల శ్రీరాం యువతతో ర్యాలీగా వెళ్లి ఆ పత్రిక కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.  ఈ ధర్నాలో వందల మంది యువకులు శ్రీరాంకి మద్దతుగా పాల్గొన్నారు. తమకు న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో నగరంలోని సప్తగిరి సర్కిల్, రాజురోడ్డు ప్రాంతాల్లో రెండు గంటలకు పైగా ట్రాఫిక్ నిలిచిపొయింది. పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. ఫలితంగా నగరం అంతటా జనం రెండు గంటలకు పైగా ట్రాఫిక్ ఇబ్బందులకు గురయ్యారు.  విషయం తెలుసుకున్న  టీడీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు పార్థసారథి, ఇతర టీడీపీ నేతలు వచ్చి శ్రీరాంతో పాటు ఇతర ఆందోళన కారులను శాంతింపజేశారు. అనంతరం వారందరూ కలిసి ర్యాలీగా పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశారు.