న్యూస్ సినిమా

శృతిహాసన్ మళ్ళీ ఫాంలోకి వచ్చింది.. ఆ ఒక్క సినిమా కూడా హిట్ అయితే ఇక తిరుగుండదు ..!

Share

శృతిహాసన్ టాలీవుడ్ లో కనిపించి దాదాపు మూడేళ్ళు దాటింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించిన కాటమరాయుడు 2017 లో వచ్చింది. ఆ సినిమా నే shruthi hasan కి లాస్ట్ సినిమా. ఆ తర్వాత దాదాపు మూడేళ్ళ గ్యాప్ తీసుకుంది. తాజాగా మాస్ మహారాజ రవితేజ నటించిన క్రాక్ సినిమాతో టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని సాధించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన క్రాక్ సినిమా చిత్ర యూనిట్ మొత్తానికి మంచి కం బ్యాక్ మూవీగా నిలిచింది.

Ravi Teja, Shruti Haasan's ''Krack'' set for Sankranti release | Telugu  Movie News - Times of India

అలాగే shruthi hasan బాలీవుడ్ లో నటించిన ‘ది పవర్’ అన్న సినిమా కూడా సంక్రాంతి సందర్బంగా జీప్లెక్స్ ఓటిటిలో విడుదలైంది. ఈ సినిమా కూడా ప్రేక్షకులను బాగానే ఆకట్టుకొని హిట్ టాక్ తెచ్చుకుంది. ఇలా ఒక తెలుగు సినిమా ఒక హిందీ సినిమా సూపర్ హిట్ అవడం తో మళ్ళీ ఫాంలోకి వచ్చింది shruthi hasan. కాగా వేణు శ్రీరాం దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ జరుపుకుంటోంది.

Shruti Haasan not keen on Vakeel Saab?

ఈ సినిమాలో shruthi hasan గెస్ట్ రోల్ లో కనిపించబోతోంది. అయితే ఇప్పుడు శృతిహాసన్ కోలీవుడ్ లో లాభం అన్న సినిమా చేసింది. విజయ్ సేతుపతి ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఈ ఒక్క సినిమా కూడా హిట్ అయితే ఇక శృతి హాసన్ కి తిరుగుండదని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే రెండు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న shruthi hasan లాభం సినిమాతో హ్యాట్రిక్ అందుకొవడం ఖాయం అంటున్నారు. చూడాలి మరి శృతి హాసన్ కి లాభం సినిమా ఎలాంటి రిజల్ట్ ని తీసుకు వస్తుందో.


Share

Related posts

బ్రేకింగ్ : వేతనాలపై ఏపీ సర్కారుకు హైకోర్టు షాక్

Srinivas Manem

రిస్క్ అవసరమా బాబు… అసలు ఏమనుకుంటున్నారు?

CMR

పోలీసులకు ఫుల్ పవర్స్ ఇచ్చిన కేసీఆర్..!!

sekhar
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar