Shruthi Hassan: కమల్ హాసన్ గారాల పట్టి శృతి హాసన్ తాను అనుకున్నట్లుగా జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఆమె నిర్ణయాలు చాలా స్వాతంత్ర్యంగా ఉంటాయని ఆమె అభిమానులు చెబుతూ వుంటారు. ఇక ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో మంచి యాక్టివ్ గా ఉంటారనేది తెలిసిన విషయమే. కొన్ని సంవత్సరాల క్రితం శృతి హాసన్ ఒక విదేశీయుడిని తన ప్రియుడిగా పరిచయం చేసింది. కానీ ఎందుకనో వారి పరిచయం పెళ్లి వరకు వెళ్ళలేదు. తరువాత అనూహ్యంగా ఆమె అతడి నుండి విడి పోయినట్లుగా ప్రకటించింది.
Shruthi hassan : శృతి హాసన్ మల్టీ టాలెంటెడ్ అని బోల్డ్ క్యారెక్టర్ ప్రూవ్ చేసింది..!
Shruthi Hassan: తాజా అప్ డేట్ ఇదే:
అతడి నుండి విడిపోయిన తర్వాత కొంత గ్యాప్ తరువాత శృతి ‘శాంతను హజారికా’తో ప్రేమలో ఉన్న విషయం బయటకు చెప్పింది. కరోనా క్వారెంటైన్.. ఐసోలేషన్ సమయంలో వీరు ఇద్దరు కలిసి ఉన్నారు. దాంతో వారి మధ్య మంచి సాన్నిత్యం ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా శృతి హాసన్ షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో ఎప్పటిలాగే వైరల్ అవుతోంది. శృతి హాసన్ – శాంతను హజారికా చాలా ట్రెడీషనల్ డ్రస్ లో ఉండి ఫోటోలు దిగారు. వీరిద్దరు ఏదో పూజా కార్యక్రమంలో పాల్గొన్నారా లేదంటే మరేదైనా కార్యక్రమంలో పాల్గొన్నారా అన్నట్లుగా ఈ ఫోటో ఉంది.
shruthi hassan : శృతి హాసన్ ఫ్యాన్స్ కి గుండె బద్దలయ్యిపోయే ఫోటో బయటపడింది!
పెళ్లి చేసుకుంటారా?
ఈ ఫోటోని సోషల్ మీడియాలో చూసిన కొందరు నెటిజన్లు మిశ్రమ స్పందనను తెలియజేస్తున్నారు. వీరిద్దరి జోడీ ఇలాగే ఎప్పటికి సంతోషంగా ఉండాలని కొందరు, శృతి హాసన్ కు ఇతడితో అయినా సంతృప్తికర జీవితం లభించాలంటూ మరికొందరు, ఈ సారైనా ఇతగాడితో శృతి పెళ్లి అవుతుందా? అనే సందేహాలు కొందరు అడుగుతున్నారు. ఇకపోతే శృతి సినిమాల విషయానికి వస్తే ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ ప్రతిష్టాత్మక సినిమా సలార్ లో ఈమె హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.