శృతి హాసన్ ఈజ్ బ్యాక్.. బుల్లితెర మీద తెగ సందడి చేసేసింది..!

అందాల సుందరి శృతి హాసన్ ను తెలుగు తెర మీద చూడక ఎన్ని రోజులు అయిందో? మధ్యలో తన సినీ కెరీర్ కు శృతి గ్యాప్ ఇచ్చింది. నిజానికి శృతికి సినిమా ఫీల్డ్ అనేది కొత్తేమీ కాదు. చిన్నప్పటి నుంచి సినిమాలను చూస్తూనే పెరిగింది. తన తండ్రి కమల్ హాసన్ ఎంత పెద్ద స్టార్ హీరోనో అందరికీ తెలుసు. అయినప్పటికీ.. కమల్ కూతురుగానే కాకుండా.. తనకంటూ ఓ స్టార్ డమ్ తెచ్చుకున్నది ఈ బ్యూటీ.

shruti hassan special appearance in zee kutumbam awards 2020
shruti hassan special appearance in zee kutumbam awards 2020

తెలుగులో స్టార్ హీరోయిన్ హోదాను అనుభవించి.. తర్వాత మాత్రం ఎందుకో ఒక్కసారిగా ఫాల్ డౌన్ అయిపోయింది. కానీ.. శృతి హాసన్ మళ్లీ తన కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. బుల్లి తెర మీద కూడా ఇప్పుడు హడావుడి చేస్తోంది.

జీ కుటుంబం అవార్డ్స్ 2020 ప్రోగ్రామ్ లో శృతి మెరిసింది. గెస్ట్ గా వచ్చిన శృతి.. స్టేజీ మీద కాసేపు అలరించింది. పాట పాడింది. యాంకర్ ప్రదీప్, శ్యామలతో కలిసి కాసేపు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసింది.

shruti hassan special appearance in zee kutumbam awards 2020
shruti hassan special appearance in zee kutumbam awards 2020

నిజానికి శృతిని బుల్లితెర మీద చూడటం చాలా అరుదు. ఎక్కువగా బుల్లితెర మీద తను కనిపించదు. కానీ.. జీ కుటుంబం అవార్డ్స్ ఫంక్షన్ లో శృతి మెరిసేసరికి.. తన అభిమానులు ఖుషీ అవుతున్నారు. దానికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

ఇక.. శృతి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం శృతి.. రవితేజతో కలిసి క్రాక్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కొనసాగుతోంది. ఇంకా రెండు మూడు ప్రాజెక్టులు తన చేతుల్లో ఉన్నాయి కానీ.. కరోనా వల్ల అవి ప్రస్తుతం ఆగిపోయాయి.