Shyam singha roy: గత కొంతకాలంగా ఎన్ని మంచి కథలతో వస్తున్నా ఆ కథలు అంతగా నచ్చక నానికి ఆశించిన హిట్ దక్కడం లేదు. అయితే ఈ సారి మాత్రం భారీ బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నాడని తాజాగా రిలీజైన శ్యామ్ సింగ రాయ్ సినిమా ట్రైలర్ చూసిన ప్రతీ ఒక్కరు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు నాని ఏ సినిమాలో కనిపించని డిఫేంట్ మేకోవర్‌తో నటించాడు. సాయి పల్లవి పాత్ర కూడా ఇప్పటివరకు ఏ సినిమాలో చూడలేదు. ఈ రెండు పాత్రలే సినిమాకు ప్రధాన బలం. అదే శ్యామ్ సింగ రాయ్ ట్రైలర్‌లో మేకర్స్ హింట్ ఇచ్చారు.

దర్శకుడిగా, శ్యామ్ సింగ రాయ్‌గా రెండు విభిన్న పాత్రలను నాని ఇందులో పోషించాడు. యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమాను విభిన్నమైన కథతో తెరకెక్కించాడు. ఇంతక ముందు కలకత్తా నగరం నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చూడాలని ఉంది..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఖుషి సినిమాలు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు నాని శ్యామ్ సింగ రాయ్ అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేస్తుందని నాని ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి నానితో చేసే ఆన్‌స్క్రీన్ రొమాన్స్ కూడా అదిరిపోతుందని ట్రైలర్‌లో చిన్న హింట్ ఇచ్చారు.
Shyam singha roy: ‘శ్యామ్ సింగ రాయ్’ ఎలా తన వశం చేసుకున్నాడు అనేదే కథలో ఆసక్తికరమైన అంశం.
దేవదాసి అయిన సాయి పల్లవిని శ్యామ్ సింగ రాయ్ ఎలా తన వశం చేసుకున్నాడు అనేదే కథలో ఆసక్తికరమైన అంశం. అలాగే ఆచారాల పేరుతో ఆడవారి మీద జరిగే ఆకృత్యాలను కొత్త తరహాలో చూపించబోతున్నాడు దర్శకుడు రాహుల్ సాంకృత్యన్. ఈనెల 24న క్రిస్మస్ కానుకగా భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శ్యామ్ సింగ రాయ్ సినిమా మీద తాజాగా రిలీజైన థియేట్రికల్ ట్రైలర్ భారీ స్థాయిలో అంచనాలను పెంచేసింది. నాని సన్నిహితుడు వెంకట్ బోయినపల్లి ఈ సినిమాతో నిర్మాతగా మారాడు. ఇక నాని కెరీర్‌లోనే శ్యామ్ సింగ రాయ్ భారీ బడ్జెట్ సినిమా కావడం విశేషం. చూడాలి మరి ఈ సినిమా నానికి భారీ హిట్ ఇచ్చి సక్సెస్ ట్రాక్ మీదకి తీసుకువస్తుందా లేదా.