NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

SI Suspension: తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ ఎస్ఐ సస్పెన్షన్..! కారణం తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!!

SI Suspension: పోలీస్ శాఖలో అధికారులకు సర్వీస్ రివాల్వర్ ఎంతో ముఖ్యమైనది. సర్వీస్ రివాల్వర్ మిస్ అయినా, వాటిలో బుల్లెట్స్ కు సరైన లెక్క చెప్పలేకపోయినా ఉద్యోగానికే ఎసరు వస్తుంది. ఎస్ఐలు బదిలీ అయిన సమయంలో తమ సర్వీస్ రివాల్వర్ ను కొత్తగా వచ్చిన ఎస్ఐకి విధులతో పాటు అప్పగించాలి లేకపోతే పోలీస్ స్టేషన్ లో సెరండర్ చేసి రిలీవ్ కావాలి. కానీ ఓ ఎస్ఐ తన సర్వీస్ రివాల్వర్ ను నూతనంగా వచ్చిన ఎస్ఐకి అప్పగించడం గానీ స్టేషన్ కు సెరండర్ చేయడం గానీ చేయకపోవడంతో ఆయనను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన తిరుపతిలో జరిగింది.

SI Suspension for service revolver missing Chittoor district
SI Suspension for service revolver missing Chittoor district

Read More: TTD Board: టీటీడీ చైర్మన్ రేసులో ఈ పెద్దాయన కూడా ఉన్నారా..?అందుకు కారణం లేకపోలేదు..!!

తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ జనార్థన్ నాయుడును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈయన చేసిన తప్పు ఏమిటంటే..జనార్థన్ నాయుడు గతంలో అనంతపురం జిల్లా క్రైమ్ పోలీస్ స్టేషన్ ఎస్ఐగా పని చేశారు. ఆ సమయంలో పలు కీలకమైన కేసులు ఛేదించారు. ఆ సమయంలో నేరస్తుల నుండి ప్రాణహాని ఉండటంతో ఎస్ఐ జనార్థన్ నాయుడు సొంత తుపాకీ అనుమతులు తీసుకుని వినియోగించాడు. ఆ తరువాత ఆయన ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్ కు బదిలీ అయి  అక్కడ బాధ్యతలు నిర్వహించాడు.

ఆ సమయంలో తన సొంత రివాల్వర్ నే ఉపయోగించుకున్నాడు. ఆ తరువాత ఆయన తిరుపతి బదిలీ కావడంతో తన సొంత రివాల్వర్ తో వచ్చి డ్యూటీలో జాయిన్ అయ్యారు. అయితే ధర్మవరం రూరల్ పోలీస్ స్టేషన్ లో కొత్తగా బాధ్యతలు చేపట్టిన ఎస్ఐకి సర్వీస్ రివాల్వర్ అందకపోవడంతో ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో డీఐజీ ఆదేశాల మేరకు విచారణ జరగ్గా బదిలీపై వెళ్ళిన జనార్థన్ నాయుడు రివాల్వర్ అప్పగించలేదనీ, రికార్డుల్లోనూ నమోదు చేయలేదని తేలింది. స్టేషన్ లోనూ రివాల్వర్ లేదని నిర్ధారణ అయ్యింది. దీంతో జనార్థన్ నాయుడిని విధుల నుండి తొలగిస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రివాల్వర్ మిస్సింగ్ పై దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!