- ఇంటిలో పిండి వంటలు చేసేటప్పుడు మరుగుతున్న నూనెలో తమలపాకు వేసి … అది రంగు మారాక తీస్తే బాణలిలో పోసిన నూనె పొంగకుండా ఉంటుంది.
- కాఫీ రుచిగా ఉండే లక్షణం కలిగి ఉంటుంది. మరింత రుచిగా కావాలంటే డికాక్షన్ లో చిటికెడు ఉప్పు వేసి తాగి చూడండి.
- కూరలు వండేటప్పుడు నూనె వేడెక్కగానే అందులో పసుపు వేస్తే, కూరలు వాటి సహజ రంగు లోనే ఉంటాయి.
- ఫ్లాస్కులని ఎంత శుభ్రం చేసినా కూడా ఒక్కొక్కసారి దుర్వాసన వస్తుంటుంది. అప్పుడు మజ్జిగ తోకడిగితే ఆ వాసన పోతుంది.
- ఒక్కొక్కసారి సెనగ పిండి చాల నిల్వ ఉండిపోతుంది. అలాంటప్పుడు దానిని పారేయకుండా ఆమ్లెట్ కోసం గుడ్డు గిలక్కొట్టిన గిన్నెలు తోమితే బాగా శుభ్రపడడం తో పాటు వాసన కూడా వదిలిపోతుంది.
- వంట గదిలో చీమలు బారులు తీరి ఉంటే కనుక అవి ఉన్న చోట నిమ్మ రసం చల్లితే మంచి ప్రయోజనం ఉంటుంది.
- పాలలో మీగడ ఎక్కువగా కట్టాలి అనుకుంటే పాలు కాచేముందు గిన్నెను కొద్దిసేపు చల్లటి నీటి లో ఉంచండి.
- గుడ్లను ఉడికించే నీళ్ళల్లో రెండు చెంచాల వినెగర్ లేదా కొంచె మంత ఉప్పు వేస్తే గుడ్లు పగిలిపోకుండా ఉంటాయి.
- పచ్చి కొబ్బరి చిప్పలు వారం పాటు తాజాగా ఉండాలంటే లోపల కొద్దిగా నిమ్మ రసం రాస్తూ ఉంటే తాజాగా ఉంటాయి.
- పచ్చిమిర్చిని కోసాక చేతులు మండ కుండా ఉండాలంటే పంచదార కలిపిన చల్లటి నీళ్ళతో చేతుల్ని కడుక్కుంటే సరిపోతుంది.
- ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగాలంటే చిటికెడు పంచదార వేస్తే చాలు.
- బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే నిల్వ చేసిన డబ్బాలో, గుప్పెడు పుదినా ఆకులు వేయాలి.
- ఇడ్లీలు మృదువుగా రావాలంటే ప్లేట్లో పిండి వేసాక చెయ్యి తడి చేసుకుని చేత్తో పిండిని పై, పై న అద్దితే సరిపోతుంది
- నెయ్యి తాజాగా, మంచి వాసన తో ఎక్కువ కాలం నిలవ ఉండాలంటే వెన్న కాచేటప్పుడు గిన్నె లో ఒక తాజా తమలపాకు వేసి కాచితే సరిపోతుంది .