Singer Mangli : సింగర్ మంగ్లీ Singer Mangli తెలుసు కదా. వీ6లో వచ్చే తీన్మార్ న్యూస్ నుంచి ప్రస్తుతం పెద్ద సింగర్ గా మారి.. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నది సింగర్ మంగ్లీ. ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలంగాణ జానపద గేయాలు పాడాలంటే మంగ్లీ తర్వాతనే ఎవ్వరైనా.
బతుకమ్మ పాటలు, బోనాల పాటలు, తెలంగాణ జానపద గేయాలు పాడటంలో మంగ్లీ దిట్ట. ఆమె వాయిసే ఆమెకు ప్రాణం. తను పాట పాడుతుంటే వింటూ మైమరిచిపోవాల్సిందే.

ప్రస్తుతం మంగ్లీకి ఆఫర్లు బాగానే వస్తున్నాయి. యూట్యూబ్ చానెళ్లలో పలు జానపద గేయాలు పాడటం, ఇతర ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయడం, వెబ్ సిరీస్ ల్లో నటించడం.. సినిమాల్లో పాడటం.. ఒకటేమిటి… మంగ్లీ మల్టీ టాలెంటెడ్.
Singer Mangli : జిగేల్ జీవన్ స్కిట్ లో మెరిసిన సింగర్ మంగ్లీ
అయితే.. తాజాగా సింగర్ మంగ్లీ.. ఎక్స్ ట్రా జబర్దస్త్ లో మెరిసింది. ఎవ్వరూ ఊహించలేదు అసలు మంగ్లీ ఎక్స్ ట్రా జబర్దస్త్ కు వస్తుందని. జిగేల్ జీవన్ స్కిట్ లో తను ఓ పాత్రలో నటించింది. పొలిటికల్ లీడర్ గా స్కిట్ లో చేసిన మంగ్లీ.. ఎన్నికల్లో పోటీ చేస్తూ.. నన్ను గెలిపిస్తే.. కామెడీ రానివాళ్లకు కామెడీ నేర్పిస్తా.. అంటూ ఓ డైలాగ్ ను విసిరింది.
మొత్తానికి జిగేల్ జీవన్ స్కిట్ లో మంగ్లీ మెరవడంతో.. ఎక్స్ ట్రా జబర్దస్త్ అభిమానులు, మంగ్లీ అభిమానులు ఖుషీ అవుతున్నారు. మంగ్లీని ఎక్స్ ట్రా జబర్దస్త్ స్టేజ్ మీద చూడటం చాలా సంతోషంగా ఉందన్నారు.
తాజాగా ఎక్స్ ట్రా జబర్దస్త్ లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఓ లుక్కేసుకోండి.