Singer Mangli :తెలుసు కదా. జానపద గేయాలతో ఫేమస్ అయిన మంగ్లీ.. Mangli ప్రస్తుతం బిగ్ సెలబ్రిటీ అయిపోయింది. ఎక్కడో వీ6 చానెల్ లో తీన్ మార్ ప్రోగ్రామ్ లో పనిచేసే స్థాయి నుంచి పెద్ద సింగర్ అయ్యే స్థాయికి చేరుకున్నదంటే దానికి కారణం ఆమె హార్డ్ వర్క్. తనలో ఒక సింగర్ ఉన్నారని గుర్తించి.. తనను ప్రోత్సహించింది మాత్రం మైక్ టీవీ. ఆ తను పాడటం మొదలు పెట్టాక.. జానపద గేయాలకు ఎంత పాపులారిటీ వచ్చిందో అందరికీ తెలుసు. అందుకే.. తెలంగాణ మొత్తానికే మంగ్లీ స్పెషల్ సింగర్.
Cash ప్రోగ్రామ్ లో Singer Mangli
అయితే.. తాజాగా ఈటీవీలో ప్రసారమయ్యే క్యాష్ ప్రోగ్రామ్ లో సింగర్ మంగ్లీ Singer Mangli గెస్ట్ గా వచ్చింది. ఆమె ఒక్కరే కాదు.. నలుగురు గెస్టులు ఈ షోకు వచ్చారు. అందరూ సింగర్లే. రఘు కుంచె, కల్పన, మంగ్లీ, ధనుంజయ్.. నలుగురు సింగర్స్ క్యాష్ ప్రోగ్రామ్ కి వచ్చి తెగ సందడి చేశారు.
వీళ్ల హంగామా అంతా ఓకే కానీ.. ఎంత హడావుడి చేసినా యాంకర్ సుమ కంటే తక్కువే. ఆమె వేసే పంచులను అర్థం చేసుకోవడానికే వాళ్ల రోజులకు రోజులు పట్టినట్టుంది. ఆమె వేసే పంచులు అలా ఉంటాయి మరి.
ఇక.. మంగ్లీతో మాట్లాడుతూ.. ఎప్పుడూ ఆ నర్సపల్లి, నర్సపురమేనా? కంబోడియా పాట పాడు.. అంటూ స్టేజ్ మీద డైరెక్ట్ గా మంగ్లీని అనేసింది యాంకర్ సుమ. దీంతో అందరూ ఒక్కసారిగా కంగుతిన్నారు. మంగ్లీ మాత్రం వెంటనే అందుకొని.. కంబోడియే అంటూ పాట పాడేసింది. నర్సబేల్లే అనే పాట తెలంగాణలో ఫేమస్ కదా. ఆ ఉద్దేశంతో యాంకర్ సుమ అలా అన్నదన్నమాట. అయితే.. ఇదంతా కేవలం ఫన్ కోసమే. లైట్ తీసుకోండి.
వచ్చే వారం ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?