ట్రెండింగ్ న్యూస్ సినిమా

Singer Mangli : నెంబర్ వన్ ట్రెండింగ్ లో సింగర్ మంగ్లీ శివరాత్రి పాట

Singer Mangli నెంబర్ వన్ ట్రెండింగ్ లో సింగర్ మంగ్లీ శివరాత్రి పాట
Share

Singer Mangli : సింగర్ మంగ్లీ Singer Mangli గురించి తెలుసు కదా. సింగర్ మంగ్లీకి తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎంత పాపులారిటీ ఉందో అందరికీ తెలుసు. తెలంగాణ మాండలికాన్ని సరిగ్గా పలుకుతూ.. తెలంగాణ జానపద గేయాలను పాడటంతో తను దిట్ట. జానపద పాటలను పాడాలంటే మంగ్లీ తర్వాతనే ఎవరైనా. మంగ్లీ వాయిస్ వింటే చాలు.. మైమరిచిపోతారు అందరూ.

Singer Mangli shivaratri song released
Singer Mangli shivaratri song released

వీ6 లో తీన్మార్ న్యూస్ లో పని చేసే స్థాయి నుంచి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక స్టార్ సింగర్ గా ఎదిగిందంటే దానికి కారణం మంగ్లీ హార్డ్ వర్క్. మైక్ టీవీలో బతుకమ్మ, బోనాలు పాటలు పాడి.. ఫేమస్ అయిన మంగ్లీ.. ప్రస్తుతం తెలుగు సినిమాల్లోనూ పాటలు పాడుతోంది. అది ఏ సినిమా అయినా సరే.. జానపద గేయాలను పాడాలంటే ఆ పాటను మంగ్లీ తప్పితే ఇంకెవ్వరూ పాడలేరు. అది మంగ్లీకి ఉన్న స్పెషాలిటీ.

Singer Mangli : తాజాగా శివరాత్రి పాటను విడుదల చేసిన సింగర్ మంగ్లీ

అయితే.. సింగర్ మంగ్లీ.. తాజాగా శివరాత్రి పాటను విడుదల చేసింది. అది ఏ పండుగ అయినా సరే.. మంగ్లీ పాట రాకుంటే ఆ పండుగ పూర్తి కాదు. బతుకమ్మ అయినా.. బోనాలు అయినా.. ఇంకే పండుగ అయినా సరే.. మంగ్లీ వీడియోను రిలీజ్ చేయాల్సిందే.

తాజాగా మంగ్లీ పాడిన శివరాత్రి పాట.. యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో ఉంది. మంగ్లీ పాడిన శివరాత్రి పాట ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తోంది. ఈ పాటను గోరెటి వెంకన్న రాశారు. ఇంకెందుకు ఆలస్యం.. మంగ్లీ పాడిన శివరాత్రి పాటను వెంటనే మీరు కూడా చూసేయండి.

 


Share

Related posts

ఈ ఏడాది మెగా అభిమానులకు పండగే..!!

sekhar

Vijay Devarakonda: పూరి కోసం శివ నిర్వాణకు కండీషన్స్..?

GRK

PM Modi Bhimavaram Tour: భీమవరంలో అల్లూరి విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ .. టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నకు అవమానం

somaraju sharma