హే చాయ్.. చటక్కునా తాగరా బాయ్.. అంటూ మెగాస్టార్ చాయ్ గొప్పతనాన్ని పాటతో తెలియజేశాడు. నిజానికి చాయ్ అంటే ఇష్టముండని వారు ఉండరు. ఖండాంతరాలు దాటినా చాయ్ రుచి చూడనిదే ఎవ్వరూ ఉండరు. చాయ్ కి ఉన్న పాపులారిటీ అటువంటిది. పొద్దున లేస్తే చాయ్.. సాయంత్రం అయితే చాయ్.. ఇంటికి ఎవరైనా వస్తే చాయ్.. ఇలా.. చాయ్ మన ఫుడ్డులో, మన సంప్రదాయంలో ఓ భాగం అయింది.
అయితే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఓ సింగర్ పాట పాడుతోంది. పాటే కదా పాడనీయ్ బ్రదర్ అంటారా? అక్కడే మీరు పప్పులో కాలేశారు.
ఎందుకంటే.. ఆ వీడియో చూస్తే.. ఆమె పాట పాడిందా? లేక తనకు చాయ్ కావాలంటూ అరిచిందా? అనే విషయం నెటిజన్లకు అర్థం కాక జుట్టు పీక్కుటుంటున్నారు.
మీరైనా కాస్త ఈ వీడియో చూసి.. ఆమె బాధ ఏంటో చెప్పండి..
चाय कि आदत वालो को चाय पिला कर ही स्टेज पर भेजना चाहिए ?#oksorry#JustForFun #WeekendFun #SaturdayFun #Tea #whatsappwonderbox pic.twitter.com/ENlV15rUxY
— SS(Golu?Molu) (@SameerSpeakss) October 10, 2020