Singer Sunitha: బేసిగ్గా సింగర్ అయినటువంటి సునీత ఇంటిపేరు చాలామందికి తెలియదు. ఎందుకంటే పాటనే ఆమె తన చిరునామాగా మార్చుకున్నారు గనక. ఇంతకీ ఆమె ఇంటిపేరు ఏమిటో తెలుసా? ఉపద్రష్ట.. సునీత ఉపద్రష్ట ఆమె అసలు పేరు. ఇటు సింగర్ గానే కాకుండా డబ్బింగ్ కళాకారిణిగా ఆమె తెలుగు సినీ కళామతల్లికి చేసిన మేలు అంతాఇంతా కాదు. గుంటూరులో పుట్టి పెరిగిన ఈమె గుంటూరు, విజయవాడలో విద్యాభ్యాసం పూర్తి చేసింది. టీవీ వ్యాఖ్యాతగా మొదలైన ఆమె కెరీర్ తరువాతి కాలంలో సహాయ దర్శకురాలిగా పలు బాధ్యతలు నిర్వహించింది.
Janvi kapoor: ఎన్.టి.ఆర్ అనుకున్నారు..అందరికీ ఆ స్టార్ కిడ్ షాకిచ్చి యంగ్ హీరోతో కమిటైందిగా..!
Singer Sunitha: మీకు తెలియని ఆమె వివరాలు ఇవిగో..
దాదాపు 15 సంవత్సరాల వయసులోనే ఆమె తెలుగు చిత్ర పరిశ్రమలో గాయనిగా అడుగు పెట్టింది. గులాబి, ఎగిరే పావురమా సినిమాలు ఆమెకు ఎంతగానో పేరు తెచ్చాయి. తర్వాత డబ్బింగ్ కళాకారిణిగా రాణిస్తూ అనేకమంది తెలుగు కథానాయికలకు తను గాత్రదానం చేసింది. ఈమె 8 సంవత్సరాల జీవిత కాలంలో సుమారు 600 సినిమాలకు డబ్బింగ్ కళాకారిణిగా పని చేసినట్టు సమాచారం.
Janvi kapoor: ఎన్.టి.ఆర్ అనుకున్నారు..అందరికీ ఆ స్టార్ కిడ్ షాకిచ్చి యంగ్ హీరోతో కమిటైందిగా..!
ఆమె చేసిన మరో ఘనత ఇదే..
ఆమె తాజాగా కర్నూలు జిల్లాలో కొలువై ఉన్నటువంటి బాలభారతి అనే పాఠశాలకు తన వంతుగా లక్ష రూపాయిల విరాళం అందించారు. ఆ పాఠశాలను స్వయంగా మహిళలే నిర్మించి, నిర్వహించడం కొసమెరుపు. వారిలో వున్న తృష్ణను అర్ధం చేసుకున్న మన సునీత ఏదో ఉడుతా భక్తిగా తనవంతు సాయం చేసింది. తాను అందించిన సేవకు గాను అక్కడ వున్న విద్యార్థులు, ప్రముఖులు కృతజ్ఞతలు తెలియజేసారు.