Singer Sunitha:టాలీవుడ్ సింగర్ సునీత గురించి తెలియని వారు ఎవరుంటారు చెప్పండి. అందమైన రూపం, శ్రావ్యమైన గొంతు ఎవరిది అంటే ఠక్కున గుర్తొచ్చేది సునీత మాత్రమే. ఈమె గత ఏడాది బిజినెస్ మెన్ రామ్ వీరపనేనిని రెండో వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం వారి వైవాహిక జీవితం అన్యోన్యంగా కొనసాగుతోంది. ఇక విషయంలోకి వెళితే సునీత సోషల్ మీడియాలో మంచి యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా తన రెండవ భర్తను కించపరుస్తూ కామెంట్ చేసిన ఓ నెటిజెన్ కు సునీత చెంప పగిలేలా సమాధానమిచ్చింది.
Intinti Gruhalakshmi: ఇంట్లో వాళ్లందరినీ జైల్లో పెట్టిస్తా.! తులసి ఆంటీనే నా ప్రాబ్లెమ్..!
Singer Sunitha: వివరాలు ఇలా వున్నాయి:
ప్రస్తుతం చినజీయర్ స్వామి తన ఆశ్రమ ప్రాంగణంలో శ్రీ రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ విగ్రహాన్ని సునీత, ఆమె భర్త రామ్ నిన్న సందర్శించారు. ఆ సమయంలో తీసుకున్న ఓ ఫొటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసి, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ అంటూ ఆ ఫొటోను పంచుకున్నారు. సదరు ఫోటోను తిలకించిన ఓ నెటిజన్ సునీత భర్తపై కామెంట్లు చేసాడు. ‘కాకి ముక్కుకు దొండపండు. సునీతకు ముసలి రామ్ మొగుడు. అందం ఈమె సొంతం. ధనం ఆయన సొంతం. గానం ఈవిడది. దర్జా అతనిది’ అని తన పోస్టులో రాసుకొచ్చాడు.
Bheemla nayak: ట్రైలర్ రెడీ.. ఎంతసేపు బ్లాస్ట్ చేయబోతుందంటే..?
సునీత ఎటాక్ కౌంటర్ ఇదే..
ఆ విధంగా అతడు రామ్ ను కించపరిచేలా కామెంట్ పెట్టడంతో సునీతకు చిర్రెత్తుకొచ్చింది. దాంతో వాడికి రిప్లై ఇస్తూ.. ‘నోటి దూల నీది. నీ భారం భూమిది’ అంటూ ఘాటుగా విరుచుకు పడింది. సదరు కామెంట్స్ ని చూసిన ఇతర నెటిజన్స్ వాడికి బాగా బుద్ధి చెప్పావు అంటూ సునీతను మెచ్చుకుంటున్నారు. అదే సమయంలో వాడికి మనవాళ్ళు ఎదురు దాడికి దిగారు. కామన్ సెన్స్ లేదా నీకు? అంటూ వాడికి దుమ్ము దులిపేస్తున్నారు.