ట్రెండింగ్ న్యూస్

Singer Sunitha : లాక్ డౌన్ వల్లనే నేను మళ్లీ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది.. సింగర్ సునిత షాకింగ్ కామెంట్స్?

singer sunitha and ram interview with anchor ram
Share

Singer Sunitha : ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సింగర్ సునిత పెళ్లి గురించే చర్చ. సింగర్ సునిత పాటలు ఎన్ని పాటలు పాడిందో… తెలుగు ఇండస్ట్రీలో ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. తను పాట పాడితే మామూలుగా ఉండదు. తన గొంతుకు కోట్లల్లో ఫ్యాన్స్ ఉన్నారు. తను మెలోడీ సాంగ్ పాడితే అదిరిపోతుంది. అది సింగర్ సునితకు ఉన్న పాపులారిటీ. కానీ.. తన పర్సనల్ లైఫ్ లో మాత్రం కొన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అని అందరికీ తెలుసు.

singer sunitha and ram interview with anchor ram
singer sunitha and ram interview with anchor ram

తనకు ఇదవరకే పెళ్లయి పిల్లలు పుట్టాక డైవర్స్ తీసుకొని ఒంటరిగా ఉంటుంది. పిల్లలు పెద్దయ్యేవరకు కూడా తను మళ్లీ పెళ్లి చేసుకోలేదు. తనను పెళ్లి చేసుకుంటామని చాలామంది వచ్చినప్పటికీ.. తను మాత్రం పెద్దగా స్పందించలేదు. కానీ.. రామ్ వీరపనేని అనే వ్యక్తి మాత్రం తన వెంట ఏళ్లకు ఏళ్లు తిరిగారట.

సునితను పెళ్లి చేసుకుంటానని ఎన్నిసార్లు చెప్పినా.. తన పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని సింగర్ సునిత.. రెండో పెళ్లి గురించి ఆలోచించలేదట.

కానీ.. ఎప్పుడైతే లాక్ డౌన్ వచ్చిందో… ఇక ఇంట్లో ఖాళీగా ఉన్న సమయంలో రామ్ కూడా చాలాసార్లు ప్రపోజ్ చేయడం.. పిల్లలు కూడా పెళ్లి చేసుకోమంటూ ఒత్తిడి చేయడంతో.. రామ్ కు ఓకే చెప్పేసిందట సునిత.

Singer Sunitha : వాలంటైన్స్ డే సందర్భంగా యాంకర్ సుమతో సునిత దంపతుల ముచ్చట్లు

వాలంటైన్స్ డే సందర్బంగా యాంకర్ సుమతో.. కొత్త జంట సునిత, రామ్… ఇద్దరూ ముచ్చటించారు. వాళ్ల మధ్య ప్రేమ ఎలా చిగురించిందో.. వాళ్లు ఎలా ఒక్కటయ్యారో.. అన్ని విషయాలు ప్రేక్షకులకు వెల్లడించారు.

లాక్ డౌన్ పెట్టకుండా ఉండి ఉంటే.. కరోనా రాకపోయి ఉంటే.. ఇంకా నేను సింగిల్ గానే ఉండేదాన్న.. కరోనా రావడం.. లాక్ డౌన్ విధించడం.. ఆ సమయంలో పెళ్లి గురించి నిర్ణయం తీసుకోవడం జరిగిందని సునిత.. సుమతో చెప్పుకొచ్చింది.

ఇంకా తమ ప్రేమ గురించి.. సునిత, రామ్.. యాంకర్ సుమకు ఏం చెప్పారో ఈ వీడియోలో చూడండి.


Share

Related posts

Keerthi suresh: ఈ సినిమాతో కీర్తి కెరీర్‌లో కొన్ని స్ట్రాంగ్ డెసిషన్ తీసుకునేందుకు డిసైడవుతుంది..

GRK

మీ వృద్దాప్యం సంతోషంగా గడవడానికి ఇలా చేయండి!!

Kumar

ACB Trap: ఏసీబీకి చిక్కిన ఇద్దరు రెవెన్యూ అధికారులు..! లంచం ఎంత డిమాండ్ చేసారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

somaraju sharma
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar