Singer Sunitha : సింగర్ సునీత తెలుసు కదా. తను ఎలాంటి సింగరో అందరికీ తెలుసు. తెలుగులో మెలోడీ సాంగ్ పాడాలంటే సునీత తర్వాతనే ఎవ్వరైనా. తన గొంతు వింటే… ఇక అలాగే వింటూ ఉండిపోవాలనిపిస్తుంది. అంత మధురంగా ఉంటుంది తన వాయిస్. తను పుట్టడమే అమృతంలాంటి గొంతుతో పుట్టారు. అందుకే మెలోడీ సాంగ్స్ అంటేనే తెలుగు సినిమా ఇండస్ట్రీ సునీత వైపు చూస్తుంది.

ఇటీవలే రెండో పెళ్లి చేసుకొని ఇప్పుడిప్పుడు హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తోంది సునీత. పాటలు పాడటంతో పాటు అప్పుడప్పుడు కొన్ని టీవీ షోలలోనూ పార్టిసిపేట్ చేస్తోంది సునీత. ప్రస్తుతం జీ తెలుగులో ఏప్రిల్ 11 నుంచి ప్రసారం అయ్యే డ్రామా జూనియర్స్ ప్రోగ్రామ్ లో సునీత జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
డ్రామా జూనియర్స్ షోకు సంబంధించిన కొన్ని ప్రోమోలు ఇప్పటికే రిలీజ్ అయ్యాయి. తాజాగా ఎపిసోడ్ వన్ ప్రోమోను విడుదల చేశారు. ఆ ప్రోమో చూస్తే తెలుస్తుంది… సింగర్ సునీత చేసిన రచ్చ.
Singer Sunitha : పాటలు పాడటమే కాదు… డ్యాన్స్ కూడా వచ్చు అని నిరూపించిన సునీత
నిజానికి సునీత కేవలం పాటలు మాత్రమే పాడుతుంది అని అంతా అనుకుంటారు కానీ… సునీత పాటలు పాడటం మాత్రమే కాదు… తను మంచి డ్యాన్సర్ కూడా. తాజాగా డ్రామా జూనియర్స్ షోలో డ్యాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
అలాగే… తను యాంకర్ ప్రదీప్ తో మాట్లాడిన మాటలు కూడా మామూలుగా లేవు. ఇంకెందుకు ఆలస్యం… డ్రామా జూనియర్స్ లేటెస్ట్ ప్రోమోను చూసేయండి.