Singer Sunitha: సునీత ఉపద్రష్ట.. బై బర్ట్ సింగర్ అయినటువంటి సునీత మాట్లాడటంలో ఎంతో నేర్పరి. అందుకే ఆమె ఒక సింగర్ గానే కాకుండా, డబ్బింగ్ కళాకారిణిగా కూడా మంచి పేరు సంపాదించింది. గుంటూరులో పుట్టి పెరిగిన ఈమె మొదట గుంటూరులో తరువాత విజయవాడలో విద్యాభ్యాసం పూర్తి చేసింది. అలాగే అనేక టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యాతగాను, సహాయ దర్శకురాలిగాను పలు బాధ్యతలు నిర్వహించింది. 15 సంవత్సరాల చిరు ప్రాయంలోనే చిత్ర పరిశ్రమలో గాయనిగా ప్రవేశించడం ఆమెకే చెల్లింది.
Pushpa 2: అప్పుడే రిలీజ్ డేట్ లాక్ చేసిన మేకర్స్..పట్టరాని ఆనందంలో బన్నీ ఫ్యాన్స్
Singer Sunitha: ఆమెకు మంచి పేరు తెచ్చిన పాటల వివరాలు:
మొదట్లో ఆమెకు గులాబి, ఎగిరే పావురమా సినిమాలు మంచి గాయనిగా పేరు తెచ్చి పెట్టాయి. తర్వాత డబ్బింగ్ కళాకారిణిగా రాణిస్తూ అనేకమంది తెలుగు కథానాయికలకు డబ్బింగ్ చెప్పింది. ఆమె సుమారు 700 సినిమాలకు డబ్బింగ్ చెప్పినట్టు టాలీవుడ్ సమాచారం. ఈమె తన మేనత్త, చిన్నమ్మ దగ్గర సంగీత పాఠాలు నేర్చుకుంది. సంగీతం వీరి కుటుంబాలలో కొన్ని తరాలుగా వస్తోంది.
Lavanya Tripathi: వరుణ్ తేజ్‌తో పెళ్లి.. లైవ్‌చాట్‌లో ఓపెన్‌గా క్లారిటీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి!
సునీత అందానికి రహస్యం తెలిసిపోయింది!
అందం, చందం అంటారు.. ఆ రెండు కలగలసి పుట్టినట్టు ఉంటుంది సునీత. అవును… ఈమెను చూసి హీరోయిన్లు సైతం కుళ్ళుకుంటారు అంటే నమ్మి తీరాల్సిందే. ఆమె గొంతుతో పాడుతూ కళ్ళతో అభినయించినట్టు కనబడుతుంది. కళ్ళల్లో ఆమె మెరుపుని చూస్తే ఎలాంటివారైనా పడిపోవాల్సిందే. అయితే ఆమె కళ్ళు అందంగా కనిపించడానికి కారణం కాటుక అని ఇపుడే తెలిసింది. తాజాగా ఆమె కాటుక పెడుతున్న రీల్ ఒకటి తన ఇన్‌స్టా వేదికగా పోస్ట్ చేసింది. వీలైతే ఓసారి లుక్కేయండి.