Singer Sunitha:’మనం గతంలోనే ఉంటే జీవితం ఆగిపోతుంది!’ ఈ మాట అన్నది అక్షరాలా సునీతనే. బేసిగ్గా సింగర్ అయినటువంటి సునీత అందంగా పాడటమే కాదు, అద్భుతంగా సంభాషణలు కూడా పలకగలదు. అందువల్లనే కొన్ని వందల చిత్రాలకి డబ్బింగ్ చెప్పింది. ‘చూడాలని ఉంది’ సినిమాలో సౌందర్య కోసం, ‘ఇంద్ర’ సినిమాలో సోనాలి బింద్రే కోసం, ‘నేనున్నాను’ సినిమాలో శ్రియ కోసం, ‘ఆనంద్’ సినిమాలో కమలినీ ముఖర్జీ కోసం.. మొదలగు హిట్ చిత్రాలకు ఆమె గాత్రదానం చేసింది.
Samantha: సమంత రిజెక్ట్ చేసిన సూపర్ డూపర్ హిట్ సినిమాల సంగతి తెలుసా?
Singer Sunitha: సునీత జీవితం ఫీలసిఫీ ఇదే..
అసలు విషయంలోకి వెళితే, అపుడెపుడో సునీత ‘ఓపెన్ విత్ ఆర్కే’లో ఇచ్చిన ఇంటర్వ్యూ ఇపుడు వైరల్ అవుతోంది. సునీత ఇటీవల రెండో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసినదే కదా. ఈ నేపథ్యంలో మన ఆర్కే ఆమెను ఇంటర్వ్యూకి పిలిచి, గతం గురించిన ప్రశ్నలు అడిగారు. దానికి ఆమె పై విధంగా స్పందించింది. ఆర్కే, సునీత మొదటి భర్త గురించి ప్రశ్నించగా సునీత కొంచెం అసహనానికి గురి అవుతూ ‘మనం గతంలోనే ఉంటే జీవితం ఆగిపోతుంది’ అంటూ సదరు ప్రశ్నని దాటవేసింది.
UP Election 2022: యుపిలో ప్రారంభమైన తొలి దశ పోలింగ్..
సునీత వెడ్స్ రామ్ ప్రస్తుతం..
మేంగో మీడియా అధినేత అయినటువంటి రామ్ ను సునీత ఇటీవల పెళ్లి చేసుకున్న సంగతి తెలిసినదే కదా. ప్రస్తుతం వీరు చాలా సంతోషంగా వున్నారు. స్వయంగా సునీత పిల్లలు ఇద్దరూ కలిసి ఈ వివాహాన్ని దగ్గరుండి జరిపించడం విశేషం. ఈమె 15 సంవత్సరాల చిరు ప్రాయంలోనే మొదటిసారిగా సినిమాలలో నేపథ్యగాయనిగా ప్రవేశించింది. శశి ప్రీతం సంగీత దర్శకత్వంలో గులాబి సినిమా కోసం సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన “ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావు” అనే పాట సునీతకు మంచి పేరు తీసుకు వచ్చింది.