తెలుగు బుల్లితెరపై టాప్ యాంకర్ గా కొనసాగుతున్న ప్రదీప్ మాచిరాజు ఎంతో మంది యాంకర్లకు ఆదర్శం అని చెప్పాలి. అందమైన అమ్మాయిలు సత్తా చాటుతున్న ఆ ప్రపంచంలోకి ఒక రేడియో జాకీగా కెరీర్ ప్రారంభించిన ఇప్పుడు టాప్ యాంకర్ అవతారం ఎత్తాడు. అద్భుతమైన టాలెంట్ తో తక్కువ సమయంలోనే ఊహించని రీతిలో గుర్తింపు దక్కించుకున్న ప్రదీప్ వ్యక్తిగత విషయాల పట్ల ఎంతో జాగ్రత్తగా ఉంటాడు.
అయితే సింగర్ సునీత తాజాగా చేసిన వ్యాఖ్యలు మాత్రం అతనికి పెద్ద షాక్ చెప్పాలి. జీ తెలుగు లో ప్రసారం అయిన ‘బిగ్ సెలబ్రిటీ ఛాలెంజ్’ షో ద్వారా ప్రదీప్ యాంకర్ గా పరిచయమయ్యాడు. ఆ తర్వాత అదే ఛానల్ లో ‘గడసరి అత్త సొగసరి కోడలు’ షో తో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు.
ప్రస్తుతం జీ తెలుగులో ప్రదీప్ యాంకరింగ్ చేస్తున్న ‘సరిగమప’ కార్యక్రమానికి సింగర్ సునీత ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక అతనిని ఉద్దేశించి ఆమె కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. “ఇక్కడే ట్రాక్ ఏదో నడుస్తున్నట్లు తెలిసింది” అని అతని పై సెటైర్ వేసింది. దానికి కారణం గతంలో ప్రదీప్ షోలో సింగర్ గా పాల్గొంటున్న ఒక అమ్మాయి పై రొమాంటిక్ కామెంట్స్ చేయడమే అని తెలుస్తోంది.
హారిక నారాయణ్ అనే అమ్మాయి పై ప్రదీప్ కొన్ని ఉద్దేశపూర్వక కామెంట్స్ చేశాడు. అప్పటినుండి ఆమెతో ప్రదీప్ ట్రాక్ నడుపుతున్నట్లు ప్రచారం జరిగింది. దీని గురించి గతంలో యాంకర్ రవి కూడా కామెంట్ చేశాడు. అయితే ఇది షో వరకు పరిమితం అని పర్సనల్ లైఫ్లో అలాంటిదేమీ లేదని ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇంకా సునీత ప్రదీప్ ఉద్దేశించి కామెంట్స్ చేసినప్పుడు హారిక ను చూపించారు. దీంతో ఇది నిజమేనా అని డౌట్లు పెరిగిపోయాయి.