Singer Sunitha: సునీత గురించి , ఆమె భర్త గురించీ సునీత తండ్రి చెప్పినది వింటే.. మీ కంట్లో నీళ్లు ఆగవు !

singer sunitha
Share

Singer Sunitha : ప్రముఖ నేపథ్య గాయని, మెలోడీ క్వీన్ సునీత జనవరి 9న తొలి వివాహ వార్షికోత్సవం జరుపుకున్న విషయం తెలిసిందే. ఈమె గతేడాది రామ్ వీరపనేని అనే ప్రముఖ వ్యాపార వేత్తను పెళ్లాడింది. తర్వాత ఎంతో సంతోషంగా తన జీవితాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికీ ఎన్నో పాటలు పాడే అవకాశాలు దక్కించుకుంటోంది. అయితే ఆమె తన పెళ్లి రోజు సందర్భంగా జర్నీ ఆఫ్ లవ్ – సునీత రామ్ | వెడ్డింగ్ మెమోరీస్ అనే ఒక వీడియో తన యూట్యూబ్ ఛానల్ వేదికగా షేర్ చేసింది. ఇందులో సునీతతో సహా ఆమె తల్లిదండ్రులు, వీరపనేని కుటుంబ సభ్యులు మాట్లాడారు. వారి మాటలు అంతా సునీతా, రామ్ ప్రేమ, పెళ్లి గురించే! ఈ క్రమంలో సునీత తండ్రి నరసింహారావు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అలాగే సునీత, రామ్ గురించి కంటతడి పెట్టించే కొన్ని వ్యాఖ్యలు చేశారు.

Singer Sunitha : సునీత, ఆమె భర్త గురించీ సునీత తండ్రి ఏం చెప్పారంటే

singer sunitha

ఈ వీడియోలో సునీత తండ్రి కన్నీళ్లు పెట్టుకోవడం చూడొచ్చు. ఆనందభాష్పాలు అంటారు కదా అలా తన కూతురు ఓ మంచి వ్యక్తితో పెళ్లి చేసుకుంటుంటే ఆయన ఆనందంతో భావోద్వేగానికి గురయ్యారు. సునీత తన తండ్రిని గట్టిగా హత్తుకొని థాంక్యూ నాన్న చెప్పడం చూస్తుంటే ఎవరి మనసైన కరిగిపోవాల్సిందే. అయితే సునీత అంటే ఎంతో ప్రేమ ఉన్న తన తండ్రి నరసింహారావు కొన్ని వ్యాఖ్యలు చేశారు. “సునీత తన జీవితంలో ఎదుర్కొని ఆటుపోట్లు అంటూ ఏమీ లేవు. అయినప్పటికీ పెద్ద కొడుకుగా ఎప్పుడూ అండగానే ఉంది. ఇప్పటికీ మా కుటుంబానికి ఓ పెద్ద కొడుకులానే ఆమె ప్రవర్తిస్తుంది. రామ్ లాంటి మంచి వ్యక్తిని వివాహం చేసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది” అని నరసింహారావు చెప్పుకొచ్చారు.

తండ్రీకూతుర్ల మధ్య అనుబంధం కన్నీళ్లాగవు

singer sunitha

19 ఏళ్లకే పెళ్లి చేసుకున్న సునీత తన వైవాహిక జీవితంలో ఎన్నో బాధలు అనుభవించింది. ఆ తర్వాత అతన్నుంచి విడిపోయి పిల్లలను తన సొంతంగా పెంచింది. ఇద్దరు పిల్లలను పెంచి పెద్ద చేసిన తర్వాతే పెళ్లి చేసుకుంది. అయితే అన్ని బాధ్యతలు నిర్వర్తించిన తర్వాతనే తన జీవితం గురించి ఆలోచించిన తన గొప్ప కూతురు గురించి గర్వంగా ఫీల్ అవుతున్నారు నరసింహారావు. అలాగే ఆమెకు కావలసిన స్వేచ్ఛనిచ్చి మంచి తండ్రిగా పేరు తెచ్చుకున్నారు. రెండో పెళ్లికి కూడా సంతోషంగా అనుమతిచ్చారు. అందుకే సునీత పెళ్లి సందర్భంగా తన తండ్రికి కృతజ్ఞతలు తెలిపింది. ఈ తండ్రీకూతుర్ల మధ్య అనుబంధం చేస్తుంటే కన్నీళ్లాగవు. అభిమానులు కూడా ఈ వీడియో చూసి చాలా ఎమోషనల్ అయిపోతున్నారు.

Singer Sunitha : సునీత గురించి ఆ అమ్మాయి పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్ అవుతోంది .. ఇంతకీ అందులో ఏముంది !


Share

Related posts

బ్రేకింగ్: రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి శ్రీపాదనాయక్ ‌కు గాయాలు, భార్య, పీఏ మృతి

somaraju sharma

రాస్కో సాంబ :: అనసూయ ని తలదన్నే అందగత్తె పుట్టదు .. కావాలంటే ఈ ఫోటో చూడండి !

GRK

Etela Rajender: మంత్రి ఈటెల వ్యవహారంపై సీఎం కేసిఆర్ కీలక ఆదేశాలు

somaraju sharma