Singer Sunitha : బిగ్బాస్ సీజన్-6 మరో కొద్ది వారాల్లో ప్రారంభం కానుంది. నిజానికి ఈ సీజన్ మరో హాఫ్ ఇయర్ తరువాత జరగాల్సి ఉంది. కానీ బిగ్బాస్ 6 ప్రొడ్యూసర్లు ఈ కరోనా సమయంలో ఎక్కువ వ్యూయర్షిప్ పొందొచ్చనే ఆలోచనతో 6వ సీజన్ ను ముందుగానే ప్రసారం చేసేందుకు రెడీ అయ్యారు. హిందీ బిగ్బాస్ మాదిరి తెలుగు సీజన్ 6 డిస్నీ+హాట్స్టార్లో 24×7 ప్రసారం కానుందని టాక్. ఈ నేపథ్యంలో బిగ్బాస్ 6లో ఏ సెలబ్రిటీలు పాల్గొననున్నారనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే యాంకర్ వర్షిణి, టిక్ టాక్ దుర్గారావు.. ప్రభాస్ శ్రీను, ప్రగతి ఆంటీ, సురేఖ తదితరులు సెలెక్ట్ అయ్యారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ప్రముఖ సింగర్ సునీతను కూడా బిగ్బాస్ 6 ప్రొడ్యూసర్లు సంప్రదించారని టాక్ నడుస్తోంది. అంతేకాదు, ఆమెకు బిగ్బాస్ నిర్వాహకులు భారీ ఆఫర్ కూడా ఇచ్చారట.
Singer Sunitha : భారీ ఆఫర్ ఇచ్చిన బిగ్బాస్ ప్రొడ్యూసర్లు
ప్రముఖ నేపథ్య గాయని సునీతకు తెలుగు రాష్ట్రాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. 26 ఏళ్లుగా ఆమె పాటలు పాడుతూ ఎందరో సంగీత ప్రియులను అభిమానులుగా మార్చుకుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరూ ఆమెను అభిమానిస్తుంటారు. ఆమె హౌజులో అడుగు పెడితే టీఆర్పీ రేటింగ్ పెరిగే అవకాశాలు ఎక్కువ అని స్టార్ మా నిర్వాహకులు భావిస్తున్నారు. అందుకే ఆమెను తాజాగా సంప్రదించి భారీ ఆఫర్ అందించారట. కానీ ఆమె మరో ఆలోచన లేకుండా వెంటనే నో చెప్పిందని తెలుస్తోంది.
NO చెప్పేసిన సింగర్ సునీత.. కారణం ఇదే ?
సింగర్ సునీత మంచి ఆఫర్ వదులుకోవడంతో స్టార్ మా నిర్వాహకులు ఒక్కసారిగా నిర్ఘాంతపోయారట. ఎందుకంటే ఇప్పటివరకు ఎవరికీ ఆఫర్ చేయనంత మొత్తం సునీతకు ఆఫర్ చేశారట. కానీ సునీత సున్నితంగా దాన్ని రిజెక్ట్ చేసిందని తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెను కన్విన్స్ చేయడానికి బిగ్బాస్ యాజమాన్యం చర్చలు కూడా జరుపుతోంది. సునీత బిగ్బాస్ షోకి నో చెప్పడానికి కచ్చితమైన కారణం ఏంటో తెలియరాలేదు. ఈ మధ్యే పెళ్లి చేసుకున్న సునీత చాన్నాళ్ల తరువాత మళ్లీ ఇప్పుడే తన జీవితంలో ఆనందకరమైన క్షణాలను ఆస్వాదిస్తోంది. ఫైనాన్సియల్ గా కూడా వెల్ సెటిల్డ్. ఆమె పాపులారిటీ కోసం వెంపర్లడాల్సిన పనేలేదు. ఇలా లైఫ్ లో అన్ని ఉండి.. అవన్నీ వదిలేసి.. బిగ్బాస్ లోకి రావాల్సిన అవసరం అంతకన్నా లేదు. కానీ షో నిర్వాహకులు ఆమెను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆశలు మాత్రం ఇప్పటికీ సజీవంగానే ఉన్నాయి.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!