Singer Sunitha: సింగర్ ప్రొఫెషన్‌తో పాటు మరొక ప్రొఫెషన్ ఎంచుకున్న సింగర్ సునీత.. ఎవ్వరూ ఊహించని ఉద్యోగం !

Share

Singer Sunitha: ‘గులాబి’ చిత్రంలోని ‘ఈవేళలో నీవూ’ అని సాగే పాటతో చిత్ర పరిశ్రమకు పరిచయమైన నేపథ్య గాయని సునీతకు ఇంట్రో అవసరం లేదు. ఎన్నో సూపర్‌హిట్ సినిమాల్లో మెలోడియస్ పాటలకు తన గానామృతంతో ఊపిరి పోసిన గాన కోకిల సునీత డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను రాణించారు. ఇటీవలే ఈమె ప్రముఖ వ్యాపారవేత్త రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత కూడా ఆమెకు బోలెడన్ని ఆఫర్లు వస్తున్నాయి. సునీతని, సంగీతాన్ని వేరు చేయలేరు అంటుంటారు. ఎందుకంటే ఆమె చిన్నతనం నుంచే సంగీతంపై విపరీతమైన మక్కువ పెంచుకుంది . దేవుడిచ్చిన గొప్ప వరం ఆమెకు స్వరమేనని కుటుంబ సభ్యులు కూడా అంటుంటారు. చిన్నప్పుడు ఏడ్చినా కూడా ఆమె ఏదో రాగం తీసినట్లుగానే ఉండేదట. అయితే 3 దశాబ్దాలుగా సింగింగ్ ప్రొఫెషన్‌కు తన జీవితాన్ని అంకితం చేసిన సునీత ఇప్పుడు సింగర్ ప్రొఫెషన్‌తో పాటు మరొక ప్రొఫెషన్ కూడా ఎంచుకున్నారు. దీంతో ఆమె అభిమానులు అందరూ ఆశ్చర్యపోతున్నారు.

Singer Sunitha: సునీత ఎంచుకున్న ప్రొఫెషన్ ఇదే

సంగీతం అంటే ఎంతగా ఇష్టపడతారో ప్రకృతి అంటే కూడా అంతే స్థాయిలో ఇష్టపడతారు సింగర్ సునీత. ప్రకృతిలో తాను ఆస్వాదించిన మధుర క్షణాలను ఆమె ఎప్పటికప్పుడు ఇన్‌స్టాగ్రామ్ @upadrastasunitha వేదికగా షేర్ చేసుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా ఆమె ఒక ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో ఆమె అరటి తోటలో అరటి గెల కొడవలితో తెంచుతూ కనిపించారు. వ్యవసాయంతో ఎంతో ఆనందం అన్నట్లు ఈ వీడియోకి ఆమె క్యాప్షన్ జోడించారు.  ఈ వీడియో చూసి “మీరు వ్యవసాయాన్ని కొత్త ప్రొఫెషన్ గా ఎంచుకోవడం చూస్తుంటే ఆనందంగా ఉంది, మేడం” అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. పాటలు, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తర్వాత సునీతకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం.

మరో వీడియోలో సునీత

సునీతకు పచ్చని తోటలు అంటే చాలా ఇష్టం. గార్డెనింగ్ అన్నా వ్యవసాయం అన్నా ఆమె చెవి కోసుకుంటారు. ఇదే విషయాన్ని ఆమె మరో వీడియోలో వెల్లడించారు. ఈ వీడియోలో ఆమె వంకాయలు.. ఏదో ఆకుకూర కోస్తూ కనిపించారు. అమితమైన ఆనందం వ్యక్తం చేస్తూ తనకు ఇలా ఫ్రెష్ కూరగాయలు కోయడమంటే చాలా ఇష్టం అని చెప్పారు. ఈ వీడియోకి రెండు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఎప్పుడూ పాటలు పాడుతూ కనిపించే సునీత ఒక్కసారిగా వ్యవసాయం వైపు వెళ్లడంతో ఆమె అభిమానులు మంత్రముగ్ధులవుతున్నారు.


Share

Related posts

తిరుపతి ఉప ఎన్నికల్లో జగన్ పార్టీకీ అదే ప్లస్..??

sekhar

Chadrababu: చంద్ర‌బాబును వైసీపీ బుక్ చేసేస్తోందిగా…

sridhar

పవన్-సోము కలిసి బాబును ఆట ఆడేసుకున్నారు..! ఇదే రాజకీయ చదరంగం

arun kanna